
గత ఏడాది భారతదేశంలో కరోనా విజృంభించింది. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు చెలరేగాయి. ప్రధానంగా కరోనా టెస్టులు పెద్దగా చేయలేదని అపవాదు ఎదుర్కొంది. ప్రజల భద్రతపై కనీస ఆసక్తి చూపకపోవడంపై కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.
తాజాగా మంత్రి కేటీఆర్ దేశంలో కరోనా వ్యాక్సిన్లపై ట్విట్టర్ ద్వారా కేంద్రా నిలదీశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తూ “మేము ఒక దేశం – ఒక పన్ను (జిఎస్టి) కోసం అంగీకరించాము, కానీ ఇప్పుడు ‘ఒక దేశం – రెండు వేర్వేరు వ్యాక్సిన్ ధరలు!?’ అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ అంటోంది. భారత ప్రభుత్వానికి టీకాను ఒక్కంటికి 150 రూపాయలకు ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 400 రూపాయలకు అమ్మడం ఏం న్యాయం.? ప్రధాని కేర్ నుండి అదనపు ఖర్చును భర్తించి దేశ ప్రజల కోసం టీకాను కొనుగోలు చేయరా? భారతదేశం అంతటా వేగంగా టీకాలు వేయడానికి ఈ మాత్రం ఖర్చు చేయరా? సహాయం చేయలేరా? ” అని కేటీఆర్ ట్వీట్ లో కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రానికి తక్కువ ధర ఇచ్చి.. రాష్ట్రాలకు అధిక ధరకు టీకాలు విక్రయిస్తారా? అని ప్రశ్నించారు.
అయితే దీనికి కౌంటర్ గా కేటీఆర్ చెప్పేదంతా అబద్ధమని స్వయంగా సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ చెప్పేది ‘ఫేక్ న్యూస్’ అంటూ నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. కరోనా టీకాలపై మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని నిలదీస్తూ చేసిన ట్వీట్ కు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం సీఈవో పూనావాలా వివరణ ఇచ్చారు. రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకటే రేటుకు వ్యాక్సిన్ ఇస్తున్నట్టు తెలిపారు. పూనావాలా ప్రకటనకు విరుద్ధంగా కేటీఆర్ ట్వీట్ ఉండడంతో సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి బుక్కయ్యాడు.
కొత్త ఒప్పందం ప్రకారం తమ నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసే కేంద్రం మరియు రాష్ట్రానికి మోతాదుకు రూ .400 వర్తిస్తుందని పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అదార్ పూనావాలా పేర్కొన్నారు. టీకా తయారీదారుల నుండి ఈ ప్రకటన రావడంతో కేటీఆర్ చెప్పేది అబద్ధమని తేలింది.
వెంటనే కేటీఆర్ ను నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. “KTRStopFakingStartWorking” అనే హ్యాష్ ట్యాగ్ ను ఆయన వ్యతిరేకులు ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. తెలంగాణలో కరోనా మరణాలను కేసీఆర్ సర్కార్ దాస్తోందని.. ముందు దానిపై సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం.. కేటీఆర్ ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారని నెటిజన్లు కౌంటర్లు ట్వీట్లు చేస్తున్నారు.
కోవిడ్ పరిస్థితిని తెలంగాణలో అదుపులోకి తీసుకురావడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని హైకోర్టు వ్యాఖ్యలను ఎత్తి చూపుతున్నారు.తమ సొంత రాష్ట్రంలోని తప్పులు సరిదిద్దకుండా ప్రతిదానికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిరంతరం నిందించినందుకు కేటీఆర్ పై తాజాగా ‘కేటీఆర్ స్టాప్ ఫేకింగ్.. స్టార్ట్ వర్కింగ్’ అని హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తున్నారు.
Another day another Fake news by KTR, always misleading people of Telangana … pic.twitter.com/Szt4yzsH9f
— Devaki Vasudeva Rao (BJP Ka Pariwar) (@VasudevaRaoBJP) April 22, 2021
ప్రభుత్వ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనాతో నిన్న మృతి చెందిన వారి సంఖ్య 23 మంది మాత్రమే…
గాందీ ఆసుపత్రిలోనే 56 మంది,టిమ్స్ ఆసుపత్రిలో 20 మంది చెందినట్లు కథనాలు వచ్చాయి..
ఏవి వాస్తవాలు ?
ఎందుకు అబద్దాలు చెప్తున్నారు ?#KTRStopFakingStartWorking pic.twitter.com/TCmOhW7mH6— SatyaNarayana Goud 🇮🇳🚩 (@SatyamG4BJP) April 23, 2021