https://oktelugu.com/

Minister KTR: నీళ్లు, క‌రెంట్ క‌ట్ చేస్తాం.. కంటోన్మెంట్ ఏరియాపై కేటీఆర్ సీరియ‌స్ కామెంట్లు

Minister KTR: ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. అయితే అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ కంటోన్మెంట్ పై ఫైర్ అయ్యారు. హైద‌రాబాద్ లో వ‌ర‌ద‌ల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా.. మొద‌ట కేంద్రం మీద నిప్పులు చెరిగారు కేటీఆర్‌. కేంద్రం తెలంగాణ‌కు ఒక్క రూపాయి ఇవ్వ‌లేద‌ని, కేంద్ర మంత్రులు వ‌చ్చి ఫొటోలు దిగారు త‌ప్ప ఒక్క రూపాయి ఇవ్వ‌లేదంటూ మండిప‌డ్డారు. అయితే కంటోన్మెంట్ విష‌యంపై చాలా సీరియ‌స్ అయ్యారు. నాలాల మీద చెక్ డ్యాములు కట్టడంతో హైద‌రాబాద్‌లో […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 12, 2022 / 05:43 PM IST
    Follow us on

    Minister KTR: ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. అయితే అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ కంటోన్మెంట్ పై ఫైర్ అయ్యారు. హైద‌రాబాద్ లో వ‌ర‌ద‌ల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా.. మొద‌ట కేంద్రం మీద నిప్పులు చెరిగారు కేటీఆర్‌. కేంద్రం తెలంగాణ‌కు ఒక్క రూపాయి ఇవ్వ‌లేద‌ని, కేంద్ర మంత్రులు వ‌చ్చి ఫొటోలు దిగారు త‌ప్ప ఒక్క రూపాయి ఇవ్వ‌లేదంటూ మండిప‌డ్డారు.

    Minister KTR

    అయితే కంటోన్మెంట్ విష‌యంపై చాలా సీరియ‌స్ అయ్యారు. నాలాల మీద చెక్ డ్యాములు కట్టడంతో హైద‌రాబాద్‌లో చాలా ఏరియాలు నీటిలో మునుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే కంటోన్మెంట్ అధికారుల‌కు చాలా సార్లు చెప్పామ‌ని, అయినా తీరు మార్చుకోక‌పోతే మాత్రం క‌ఠిన మైన చ‌ర్య‌లు ఉంటాయ‌ని వార్నంగ్ ఇచ్చారు.

    Also Read: జ‌గ‌న్ వేటు వేసేది వారి మీదేనా.. సామాజిక వ‌ర్గాల ఆధారంగానే మార్పు..?

    కంటోన్మెంట్ ఏరియాల్లో ఇష్టం వ‌చ్చిన‌ట్టు రోడ్లు మూసేసినా కూడా ఊరుకోబోమంటూ గ‌ట్టిగానే జ‌వాబు ఇచ్చారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోసం తాము ఎంత దూరం అయినా వెళ్తామ‌ని అవ‌స‌రం అయితే కంటోన్మెంట్ ఏరియాకు నీళ్లు, కరెంటు కూడా కట్ చేస్తామంటూ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. కంటోన్మెంట్ ఏరియా అనేది హైదరాబాద్ లో అంత‌ర్భాగంగా ఉండాలంటూ చెప్పారు.

    KTR

    హైద‌రాబాద్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో తామే నిధులు ఇస్తున్నామ‌ని, కేంద్రం ఎలాంటి సాయం చేయ‌ట్లేదంటూ మండిప‌డ్డారు. హైద‌రాబాద్ లో మురుగునీరు, వ‌ర‌ద‌నీరు వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌ర్చ‌డం కోసం ఎస్ ఎన్డీపీ కార్య‌క్ర‌మాన్ని తీసుకున్న‌మాని, రూ.985కోట్లు ఇందుకోసం కేటాయించిన‌ట్టు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాబోయే కాలంలో మ‌రింత నిధులు ఇస్తామ‌న్నారు.

    Also Read:ఉక్రెయిన్ లో చ‌నిపోతున్న సైనికుల‌ను కుక్క‌ల‌కు వ‌దిలేస్తున్నారా.. ఏంటీ దారుణం..!

    Tags