Lyricist Kandikonda Passes Away: షాకింగ్ : ప్రముఖ సినీ రచయిత మృతి

Lyricist Kandikonda Passes Away: సినీ గేయ రచయిత కందికొండ గారి మరణం తెలుగు చలన చిత్ర సీమకే కాదు.. తెలుగువారికి కూడా విషాదకరమైన సంఘటనే. సినీ ప్రముఖులు, అభిమానులు కందికొండ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. కందికొండ గారిని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన సన్నిహితులు తరలివస్తున్నారు. అందరూ కన్నీళ్లతో ఆ అక్షర శిల్పికి అశ్రునివాళి అర్పిస్తున్నారు. కందికొండ గారు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆయన లేకుండా తెలుగు సినిమా పాటలు […]

Written By: Shiva, Updated On : March 12, 2022 5:33 pm
Follow us on

Lyricist Kandikonda Passes Away: సినీ గేయ రచయిత కందికొండ గారి మరణం తెలుగు చలన చిత్ర సీమకే కాదు.. తెలుగువారికి కూడా విషాదకరమైన సంఘటనే. సినీ ప్రముఖులు, అభిమానులు కందికొండ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. కందికొండ గారిని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన సన్నిహితులు తరలివస్తున్నారు. అందరూ కన్నీళ్లతో ఆ అక్షర శిల్పికి అశ్రునివాళి అర్పిస్తున్నారు.

Lyricist Kandikonda Passes Away

కందికొండ గారు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆయన లేకుండా తెలుగు సినిమా పాటలు ఊహించలేం. సాహిత్యం, విలువల గురించి తెలిసిన వ్యక్తి కందికొండ. అలాంటి కవి, సాహితీవేత్త కన్నుమూయడం దురదృష్టకరం. కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకు సేవ చేయాల్సిన వ్యక్తి.. ఇలా సడెన్ కన్నుమూయడం చాలా బాధాకరమైన విషయం.

Also Read:   ‘రాధేశ్యామ్’ నెగిటివ్ టాక్ పై థమన్ సెటైర్లు

కొన్నిసార్లు ఆవేదన, బాధను వ్యక్తపరచడానికి మాటలు రావు అంటారు. అలాంటి మాటలను కందికొండ తన కలంతో అద్భుతంగా వ్యక్తపరిచేవారు. ఆయన రాసిన పాటలు తెలుగుజాతి, భాష బ్రతికున్నంత కాలం చిరస్మరణీయంగా ఉంటాయి. మన హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన సినీ గేయ రచయిత కందికొండ వయసు 40 సంవత్సరాలు.

Lyricist Kandikonda Passes Away

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నేడు మరింతగా విషమించింది. దాంతో ఆయన నేడు మృతి చెందారు. వెంగళరావు నగర్‌లోని తన ఇంట్లో కందికొండ నేడు తుదిశ్వాస విడిచారు. ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి,

కాగా మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున కందికొండ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Also Read:  ‘రాధేశ్యామ్’ సెకండ్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Tags