https://oktelugu.com/

లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్

కరోనా నియంత్రణ, లాక్ డౌన్ కాలంలో మున్సిపల్‌ శాఖ విధి విధానాలపై మంత్రి కేటీఆర్‌ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… కరోనా కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాష్ట్రంలో దశలవారీగా లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు. కావునా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పట్టణాల్లో సరి, బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 9, 2020 2:16 pm
    Follow us on

    కరోనా నియంత్రణ, లాక్ డౌన్ కాలంలో మున్సిపల్‌ శాఖ విధి విధానాలపై మంత్రి కేటీఆర్‌ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… కరోనా కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాష్ట్రంలో దశలవారీగా లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు. కావునా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పట్టణాల్లో సరి, బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. వ్యాక్సిన్‌ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందన్నారు. కరోనా కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్య, పురపాలకశాఖలు ఇవాళ విడుదల చేస్తాయని తెలిపారు. మాస్కుల వినియోగం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ల వినియోగాన్ని కొనసాగించాలన్నారు.

    వానాకాలంలో వచ్చే డెంగీ తదితర వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. యాంటీ లార్వా యాక్టివిటీస్‌ కార్యక్రమాన్ని రేపట్నుంచే ప్రారంభించాలన్నారు. డెంగీ నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి పట్టణంలో మురుగుకాల్వలను శుభ్రంచేసి చెత్తను తరలించాలని చెప్పారు. ప్రతి పట్టణంలో మ్యాన్‌ హోల్‌ మరమ్మతులు పూర్తిచేయాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది రక్షణ కవచాలు, మాస్కులు లేకుండా పనిచేయరాదన్నారు. అలా కనిపిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లదేనని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రూ. 830 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన పనులపై నివేదిక పంపాల్సిందిగా కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.