కేటీఆర్ ఆంధ్రులకూ ఆప్తుడయ్యారు

ప్రార్థింే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న అంటారు. సహాయం చేసే గుణం ఉండేలా కానీ ఎక్కడున్నా ఎవరైనా సరే చేతులు చాచి సాయం చేయొచ్చు అని నిరూపిస్తున్నారు కేటీఆర్. తనలోని దాతృత్వానికి అంతా ఫిదా అయిపోతున్నారు. తన పరిధి కాదని చెప్పుకుంటూ దాటవేసే నేతలున్న నేటి రోజుల్లో పక్క రాష్ర్టమైనా వారి బాధలను పట్టించుకుని పరిష్కరించే మంత్రిని అందరూ ప్రశంసిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కోవిడ్ రోగికి కాకినాడలో వెంటిలేటర్ బెడ్ అవసరమైంది. […]

Written By: Srinivas, Updated On : May 23, 2021 2:15 pm
Follow us on

ప్రార్థింే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న అంటారు. సహాయం చేసే గుణం ఉండేలా కానీ ఎక్కడున్నా ఎవరైనా సరే చేతులు చాచి సాయం చేయొచ్చు అని నిరూపిస్తున్నారు కేటీఆర్. తనలోని దాతృత్వానికి అంతా ఫిదా అయిపోతున్నారు. తన పరిధి కాదని చెప్పుకుంటూ దాటవేసే నేతలున్న నేటి రోజుల్లో పక్క రాష్ర్టమైనా వారి బాధలను పట్టించుకుని పరిష్కరించే మంత్రిని అందరూ ప్రశంసిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కోవిడ్ రోగికి కాకినాడలో వెంటిలేటర్ బెడ్ అవసరమైంది. అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్విటర్ ద్వారా విన్నవించారు. అంతే సమస్య తీరింది. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తికి రెమిడెసివర్ ఇంజక్షన్ కావాలని కేటీఆర్ కు ట్విటర్ లో పోస్టు చేశారు. తక్షణమే ఏపీ మంత్రి గౌతంరెడ్డి సహాయంతో సమస్య తీర్చారు.

తెలంగాణలో అన్ని పనులు చక్కబెడుతున్నకేటీఆర్ మంత్రి హోదాలో తనకు ట్విటర్ లో విన్నవిస్తున్న వారి సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ట్విటర్ వేదికగా సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపిస్తున్నారు. లేకపోతే తన పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. కేటీఆర్ ను నేరుగా కలిసే మార్గం లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా ట్విటర్ లో అనుసరించే ప్రజల వినతులను ఎప్పటికప్పుడు తీర్చేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని నియమించుకున్నారు.

మన రాష్ర్టంలో కష్టం వస్తే తీర్చడం కొత్తేమీ కాదు. కానీ పక్క రాష్ర్టం వారికైనా చేయూతనందించడం శుభ పరిణామం. ఆంధ్ర ప్రజలకు ఆపన్న హస్తం అందించడం స్వాగతించదగినదే. ఆంధ్ర మంత్రులకు చెప్పి సమస్యల పరిష్కారానికి కేటీఆర్ చూపుతున్న చొరవతోనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అక్కడి వారు సైతం చెబుతున్నారు. కేటీఆర్ స్పందనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయనలో ఉన్నసాయం చేసే గుణానికి అక్కడి ప్రజలు వేనోళ్ల పొగుడుతున్నారు. సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉందని గుర్తించడం గొప్ప విషయమే.

సోషల్ మీడియాతోనే..
సోషల్ మీడియాతోనే కేటీఆర్ తన పనులు చేస్తున్నారు. ట్విటర్ లో వినతులు చూసి వాటిని పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తూ ముందుకు వెళుతున్నారు. సమస్యలు తీర్చేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రాంతమేదైనా సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రాధాన్యం ఇస్తున్నారు.