KCR: కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ మాటల మాంత్రికులు. ఎదుటి వారు ఎంతటి వారైనా సరే తమ మాటలతో కట్టి పడేయగలరు. భహిరంగ సభల్లో ఎంత గందరగోళంగా ఉన్నా సరే ప్రజలను తమ స్పీచ్ వైపు తిప్పుకోగల వక్తలు. అందుకే సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ లో మాట్లాడుతున్నారంటే ప్రజలు ఆసక్తిగా వచ్చి చూస్తారు. ఆయన మాటల్లో చమత్కారాలు, సామెతలు, పద్యాలు వంటివి ఉంటాయి. అలాగే కేటీఆర్ కూడా సందర్భోచితంగా నవ్వులు తెప్పించే సరదా వ్యాఖ్యలు చేస్తుంటారు. చాలా అంశాలపై అనర్గలంగా మాట్లాడగలుతారు.

కేసీఆర్‌పై సరదా వ్యాఖ్యలు..
హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తీరిక లేకుండా ఉన్నారు మంత్రి కేటీఆర్. నియోజవర్గ స్థాయి, మండల స్థాయి నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ తెలుసుకుంటూ పార్టీ అధినాయకుడికి సమాచారం చేరవేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన సరదా వ్యాఖ్యలు చేశారు. ‘ మా బాస్ ఇచ్చిన పనితో నాకు తీరెం లేదు. నాలుగైదు రోజులగా ఒర్రి ఒర్రి గొంతు పోతున్నది’ అంటూ గమ్మత్తుగా మాట్లాడారు.
నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం..
నవంబర్ వరకు వరంగల్ పరిధిలో ఉన్న నామినేటెడ్ పదువులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేషన్ పదవులను పార్టీ అధినాయకుడితో మాట్లాడి భర్తీ చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజలో ఉందని, ప్రధాని కూడా తాము ప్రవేశపెట్టిన పథకాలను కాపీ చేస్తున్నారని అన్నారు. పాలనపై దృష్టి సారించడం వల్ల పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలపై దృష్టి పెట్టలేదని తెలిపారు. త్వరలోనే వాటిని కూడా క్లియర్ చేస్తామని అన్నారు.