https://oktelugu.com/

KTR: కేటీఆర్ వ్యాఖ్యలతో మళ్లీ ఆంధ్రా-తెలంగాణ గొడవ!

KTR: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు ఆంధ్రప్రదేశ్‌లో నరకంగా పరిస్థితులు ఉన్నాయన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి పదునైన విమర్శలకు దారితీసింది. ఇది క్రమంగా ఆంధ్ర-తెలంగాణ మధ్య కొత్త వివాదానికి దారితీసింది. పొరుగు తెలుగు రాష్ట్రం గురించి తెలంగాణ మంత్రి మాట్లాడటం తగదని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కేటీఆర్‌పై […]

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2022 / 07:20 PM IST
    Follow us on

    KTR: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు ఆంధ్రప్రదేశ్‌లో నరకంగా పరిస్థితులు ఉన్నాయన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి పదునైన విమర్శలకు దారితీసింది. ఇది క్రమంగా ఆంధ్ర-తెలంగాణ మధ్య కొత్త వివాదానికి దారితీసింది.

    పొరుగు తెలుగు రాష్ట్రం గురించి తెలంగాణ మంత్రి మాట్లాడటం తగదని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కేటీఆర్‌పై ఘాటుగా మండిపడ్డారు. “సంక్రాంతి సెలవుల కోసం ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన తన స్నేహితుడిని ఉటంకిస్తూ, అధ్వాన్నమైన రోడ్లు.. విద్యుత్.. నీటి సరఫరా లేకపోవడంపై కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కానీ బొత్స దీనికి కౌంటర్ ఇచ్చాడు. ‘నేను ఇప్పుడే హైదరాబాద్ నుండి వస్తున్నాను. హైదరాబాద్‌లోని మా ఇంట్లో రెండు రోజులుగా కరెంటు లేదు. మేము జనరేటర్‌ తో ఉండాల్సి వచ్చింది. దీనిపై కేటీఆర్ ఏమంటారు?’ అని బొత్స కూడా ఘాటుగానే ప్రశ్నించాడు.

    బొత్స వ్యాఖ్యలపై స్పందించిన చేవెళ్ల టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంటికి బొత్స కరెంట్ బిల్లు చెల్లించకపోయి ఉండవచ్చని కౌంటర్ ఇచ్చాడు. అందుకే విద్యుత్ సరఫరా లేదు కావచ్చని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణలో మేము నిరంతర విద్యుత్ సరఫరాను చేస్తున్నాం” అని ఆయన చెప్పాడు.

    కోస్తా ఆంధ్ర ప్రజల చెమట, రక్తంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ గురించి కేటీఆర్‌ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంపై విజయవాడకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత మల్లాది విష్ణు తప్పుబట్టారు. ‘‘తెలంగాణ ప్రజలకు సంస్కృతి నేర్పింది ఆంధ్రా వాళ్లే. వారి పెట్టుబడి వల్లనే తెలంగాణ అభివృద్ధి చెందింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు కేటీఆర్ విజయవాడకు రావాలి’’ అని ఆయన అన్నారు.

    కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే రోజులు వస్తాయని విష్ణు హెచ్చరికలు సైతం చేశాడు. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచిందని, జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే మళ్లీ ఆంధ్రా తెలంగాణ మధ్య గొడవలకు దారితీస్తున్నాయనే చెప్పొచ్చు.

    Recommended Videos