నాడు ద్వేషించినవాళ్లే.. నేడు ప్రేమిస్తున్నారు: కేటీఆర్

రాష్ట్ర విభజన సమయంలో లక్షలాది ప్రజలు కేసీఆర్ ను వ్యతిరేకించారని.. కానీ నేడు వారంతా ఆయనను ప్రేమిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆయన రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఈ ఏడాది టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు సామాజిక దూరంగా పాటిస్తూ తమ ఇళ్లపై టీఆర్ఎస్ జెండాలను ఎగురవేయాలని కోరారు. వారంరోజులపాటు రక్తదాన కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. […]

Written By: Neelambaram, Updated On : April 26, 2020 7:50 pm
Follow us on


రాష్ట్ర విభజన సమయంలో లక్షలాది ప్రజలు కేసీఆర్ ను వ్యతిరేకించారని.. కానీ నేడు వారంతా ఆయనను ప్రేమిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆయన రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఈ ఏడాది టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు సామాజిక దూరంగా పాటిస్తూ తమ ఇళ్లపై టీఆర్ఎస్ జెండాలను ఎగురవేయాలని కోరారు. వారంరోజులపాటు రక్తదాన కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ఆవిర్భావించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు స్ఫూర్తినిచ్చిన ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ రావు లాంటి మహానుభవాలను గుర్తుంచుకుంటామన్నారు. ఒకరిద్దరితో మొదలైన పార్టీ ప్రస్తుతం 60లక్షల మంది కార్యకర్తలతో అజయ శక్తిగా మారిందన్నారు. టీఆర్ఎస్ దేశ రాజకీయాలపై ప్రత్యక్షంగా కాకపోయిన పరోక్షంగా ప్రభావం చూపిస్తుందన్నారు. కరోనా పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్గ దర్శనం చూసిన తర్వాత ఆయన నాయకత్వం మరో పదిహేనేళ్లు కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అందులో తానొక్కడినిని చెప్పారు.

ప్రపంచంలోని అతిపెద్ద మల్టిస్టేజ్ ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం హరితవిప్లవంతోపాటు క్షీరవిప్లవం, గులాబీ విప్లవం, నీలి విప్లవం, జలవిప్లవాలను సాధించిందని తెలిపారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు కేసీఆర్ చేపడుతున్న చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని తెలుగువాళ్లంతా ఆయన ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా ఎఫెక్ట్ అనంతరం పార్టీ ఆవిర్భావ వేడుకలు, కార్యకర్తలకు శిక్షణ వంటి వాటిపై ఆలోచిస్తామని కేటీఆర్ వివరించారు.