కృష్ణా జలాలు సీమకు తరలించాలి: ఏపీ బీజేపీ

శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ కు నీళ్ళు ఇవ్వాలన్నదే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. తెలంగాణ తో ఏపి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో ఏమీ చేస్తారో తెలియదని, రాయలసీమ వారికి మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాలని తెలిపారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బిజెపి పోరాటాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 1:19 pm
Follow us on

శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ కు నీళ్ళు ఇవ్వాలన్నదే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. తెలంగాణ తో ఏపి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో ఏమీ చేస్తారో తెలియదని, రాయలసీమ వారికి మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాలని తెలిపారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బిజెపి పోరాటాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతకుముందు కన్నా రెడ్డిపాలెంలోని ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ తో కలసి బాధితుల పరామర్శించారు. ఈ సెంటర్ లో 120 మంది ఉన్నారు.

శ్రీశైలం మిగులు జలాలు వినియోగిచు కోవాలని ఏపీ బీజేపీ అంటుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల వాదన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కృష్ణానది జలాల దోపిడిని అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఎపి ప్రభుత్వ జీఓ నంబరు 203ను రద్దు చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్, కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌ లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దీక్ష చేశారు.