https://oktelugu.com/

కోవాగ్జిన్ రేటు కేంద్రమే పెంచిందా?

దేశంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కావాల్సినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి డబ్బులు తీసుకుని టీకాలు వేస్తున్నారు. ఒక్కో టీకా రూ.1000 ఉంటోంది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ అయితే రూ.1500 వరకు తీసుకుంటున్నారు. కొవాగ్జిన్ వాటర్ బాటిల్ కంటే తక్కువ రేటుకే ఇస్తామని భారత్ బయోటెక్ ప్రకటించింది. కానీ ఇప్పుడేమో ఎక్కువ రేటుకు ఇవ్వడంతో విమర్శలు వస్తున్నాయి. ఇవి తీవ్రం అవుతుండడంతో కోవాగ్జిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది. కోవాగ్జిన్ ఎక్కువ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 15, 2021 / 08:41 PM IST
    Follow us on

    దేశంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కావాల్సినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి డబ్బులు తీసుకుని టీకాలు వేస్తున్నారు. ఒక్కో టీకా రూ.1000 ఉంటోంది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ అయితే రూ.1500 వరకు తీసుకుంటున్నారు. కొవాగ్జిన్ వాటర్ బాటిల్ కంటే తక్కువ రేటుకే ఇస్తామని భారత్ బయోటెక్ ప్రకటించింది.

    కానీ ఇప్పుడేమో ఎక్కువ రేటుకు ఇవ్వడంతో విమర్శలు వస్తున్నాయి. ఇవి తీవ్రం అవుతుండడంతో కోవాగ్జిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది. కోవాగ్జిన్ ఎక్కువ రేటుకు కారణం కేంద్రం అని చెప్పేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తమకు డోస్ కురూ.150కే ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఉత్పత్తిలో 75 శాతం తీసుకుంటోంది.

    మొత్తం ఖర్చును తాము వసూలు చేసుకోవాలంటే బహిరంగ మార్కెట్ లో డోసు రూ.1500 అమ్మాల్సిందేనని తేల్చి చెప్పింది. ధర తగ్గించే అవకాశమే లేదని పేర్కొంది. కేంద్రానికి ఇస్తున్న డోసుల బారాన్ని కోవాగ్జిన్ నేరుగా ప్రజల నుంచి వసూలు చేస్తోంది. కేంద్రం కంపెనీలను ఆదేశించి ఆ కంపెనీలు తమ ఉత్పాదక ఖర్చులు లాభాలను మిగిలిన మొత్తం ధరలను పెంచడం ద్వారా వసూలు చేసుకుంటాయి.

    కేంద్రం సబ్సిడీని తీసుకుని రాష్ర్ట ప్రభుత్వాలకు ఉచితంగా సరఫరా చేస్తున్న టీకాల ఖర్చులన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న ప్రజలు ఇస్తున్నారన్నమాట ప్రజలకు ఈ లాజిక్ లను ఎప్పుడు అర్థం చేసుకుంటారో కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ మాయాజాలాలు కొనసాగిస్తూనే ఉంటాయి.