https://oktelugu.com/

YCP ZPTC: వైసీపీలో ఆమె చేసిన పని వైరల్

అటువంటి తాజా ఘటన ప్రకాశం జిల్లాలో ఒకటి వెలుగుచూసింది. కొరిశపాడు జడ్పీటీసీ వెంకటరమణ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భోరున విలపించింది. తనకు తెలియకుండా పనులు ఇచ్చేస్తున్నారని కనీసం సమాచారం కూడా ఇవ్వరా అని బాధపడింది.

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : June 30, 2023 / 02:13 PM IST

    YCP ZPTC

    Follow us on

    YCP ZPTC: ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వస్తున్నా.. అని ఖద్దరు చొక్కా వేసుకునే ప్రతి ఒక్కరు చెప్పేమాటే. అయితే, కొందరు కొంతలో కొంత నీతి నిజాయితీగా ఉంటారు… మరికొందరు పక్కా కమర్షియల్. సేవ అనే మాట ఉత్తతే.. ఎంత సంపాదించాం అని చూసుకునే వారు రాజకీయ నాయకుల్లో చాలా మంది ఉన్నారు. వ్యవస్థ అలా మారిపోయింది. సంక్షేమం మాటున కూడా కమర్షియల్ దాగి ఉన్న రోజులివి. బడా స్థాయి అధికార పార్టీ నాయకులైతే కొంత ఫర్వాలేదు.. గానీ, కింది స్థాయి నాయకులు సంపాదన ఉండటం లేదని చాలా మంది ప్రస్తుతం ఏడుపు మొహం పెడుతున్నారు.

    అటువంటి తాజా ఘటన ప్రకాశం జిల్లాలో ఒకటి వెలుగుచూసింది. కొరిశపాడు జడ్పీటీసీ వెంకటరమణ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భోరున విలపించింది. తనకు తెలియకుండా పనులు ఇచ్చేస్తున్నారని కనీసం సమాచారం కూడా ఇవ్వరా అని బాధపడింది. ఇష్టానుసారంగా పనులు ఇచ్చుకుంటూపోతే ఇంకా పదవి ఎందుకని వాపోయింది. గతంలో కూడా జరిగిన అన్యాయాలు, అక్రమాలపై ఏకంగా జడ్పీ సమావేశంలో పెడబొబ్బలు పెట్టింది. ఛాయ్, బిస్కెట్ కోసం మీటింగ్ కు వస్తున్నామా? అని నిలదీసింది. వైసీపీతో ఉండటం వేస్ట్ అని తెగ బాధపడిపోయింది. అధికార పార్టీ జడ్పీటీసీ కాబట్టి ఆంధ్రజ్యోతిలో ఆమె వ్యాఖ్యలను తనకు నచ్చిన రీతిలో ప్రచురించింది. ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో వైరల్ గా మారిపోయింది. ఆమె ఆవేదనను అధికార పార్టీ నేతలను కనీసం పట్టించుకోకపోయినా, ప్రతిపక్ష పార్టీ పత్రికైనా పట్టించుకుందనే తృప్తిని ఆమె మిగిల్చింది. ఇందులో కూడా లోగుట్టు లేకపోలేదు.

    ఇక విషయానికి వస్తే… రాజకీయాల్లోకి రావడం అనేది ప్రజా సేవ కోసమే అన్న సంగతి చాలా మంది మరిచిపోయారు. అధికార పార్టీలో ఉంటే నాలుగు రాళ్లు వెనుకోసుకోవడమే అన్న అభిప్రాయం అలా పాతుకుపోయింది. ఆ ప్రకారం చూసుకున్నా, ఆమె బాధలో తప్పులేదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. ఇది ఒక్క ఆమెకు వర్తించేది కాదు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలైతే బాగానే గిట్టుబాటు అవుతున్నదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ మేరకు వెసులుబాటు లేనివాళ్లు కాలు కాలినట్లు అధికార పార్టీపై దుమ్మెత్తిపోయడం చూస్తూనే ఉన్నాం.

    అప్పుడెప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య వాంటి వారు నిజాయితీగా ఉండేవారని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అలాంటి నాయకులు మనకు కావాలని చాలా సందర్భాల్లో కోరుకుంటున్నాం. ప్రస్తుతం మూడో ప్రత్యామ్నాయ పార్టీగా కనబడుతున్న జనసేన అధినేతలో ఆ మేరకు లక్షణాలు కనబడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నోటు, క్వార్టరుకు ఓటును అమ్ముకునే రోజులు పోయే వరకు సరైన పార్టీ నాయకులు అందుబాటులోకి రారని తెలిసిపోయింది. ఇప్పటికైనా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే.