https://oktelugu.com/

Coca-Cola: కోకాకోలా తో క్యాన్సర్? డబ్ల్యూహెచ్ వో కీలక సూచన

అయితే ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ లోని క్యాన్సర్ విభాగం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ పలు పరిశోధనలు చేసిన తరువాత ఆ పదార్థాలు మానవులకు క్యాన్సర్ కారకాలు అని తేల్చింది. అయితే వీటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. పూర్తి పరిశోధనలు జరిగిన తరువాత వివరాలు వెల్లడిస్తామని ఐఏఆర్సీ తెలపింది. దీంతో ఇవి కూల్ డ్రింక్స్ మార్కెట్లపై విపరీత ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 30, 2023 2:16 pm
    Coca-Cola

    Coca-Cola

    Follow us on

    Coca-Cola: శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల అనేక అనర్థాలకు దారి తీస్తుందని ఎంతో మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా చాలా మంది వీటికి బానిసైపోయారు. కాస్త చల్లటి పానీయం తాగాలనుకునేవారు కూల్ డ్రింక్స్ వైపే మొగ్గు చూపుతారు. అయితే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అనర్థాలు మాత్రమే కాదని, క్యాన్సర్ కు కూడా దారి తీస్తుందని ఓ అధ్యయనం వెల్లడిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో కృత్రిమ స్వీటెనర్ల వినియోగంపై హెచ్చరికలు జారీ చేసింది. ఇంతలోనే కృత్రిమ స్వీటెనర్లలో ఉపయోగించే ముడిపదార్థాల్లో క్యాన్సర్ సమస్యలు తలెత్తుతున్నాయని రాయిటర్స్ అనే సంస్థ తెలిపింది.

    కూల్ డ్రింక్స్ లో వినియోగించే డైట్, షుగర్-ఫ్రీ, లో క్యాలరీ, జీరో షుగర్, వంటి ఆహార పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. సాధారన చక్కెర కంటే ఇవి 200 రేట్లు తియ్యంగా ఉండే వాసన లేని పౌడర్లు. వీటిని 1981లో అమెరికా ఫుడ్ డ్రగ్ అడ్మిని స్ట్రేషన్ శీతల పానీయాల్లో ఉపయోగించడాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి వీటిని ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో ఉపయోగిస్తున్నారు.

    అయితే ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ లోని క్యాన్సర్ విభాగం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ పలు పరిశోధనలు చేసిన తరువాత ఆ పదార్థాలు మానవులకు క్యాన్సర్ కారకాలు అని తేల్చింది. అయితే వీటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. పూర్తి పరిశోధనలు జరిగిన తరువాత వివరాలు వెల్లడిస్తామని ఐఏఆర్సీ తెలపింది. దీంతో ఇవి కూల్ డ్రింక్స్ మార్కెట్లపై విపరీత ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు.

    ముఖ్యంగా ప్రపంప ప్రఖ్యాత కలిగిపి కోకోకోలా, పెప్సీ, ఇతర కార్పోనేటెడ్ శీతల పానీయాల్లో డైట్, షుగర్-ఫ్రీ, లో క్యాలరీ, జీరో షుగర్, వంటి పదార్థాలు ఉపయోగిస్తున్నందున ఆ కంపెనీలపై మరింత ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వార్తల నేపథ్యంలో కోకాకోలా, పెప్సీలపై ఈ ప్రభావం ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.