ట్విట్టర్ పిట్టకన్నా.. గట్టిగ ‘కూ’స్తోంది..

కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో స్టార్టప్ లను ప్రోత్సహిస్తోంది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మేకిన్ ఇండియా కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత వచ్చింది. భారత్ లో తయారయ్యే ఉత్పత్తుల గురించి నేడు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఇక తాజాగా భారత్ లో ట్విట్టర్ ను పోలిన మైక్రో బ్లాగింగ్ సైట్ పై పెద్ద చర్చ జరుగుతోంది. దాని పేరే ‘‘కూ’’. ఈ కూ యాప్ ఇప్పుడు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ యాప్ పై పలువురు కేంద్ర […]

Written By: Srinivas, Updated On : February 10, 2021 5:02 pm
Follow us on


కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో స్టార్టప్ లను ప్రోత్సహిస్తోంది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మేకిన్ ఇండియా కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత వచ్చింది. భారత్ లో తయారయ్యే ఉత్పత్తుల గురించి నేడు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఇక తాజాగా భారత్ లో ట్విట్టర్ ను పోలిన మైక్రో బ్లాగింగ్ సైట్ పై పెద్ద చర్చ జరుగుతోంది. దాని పేరే ‘‘కూ’’. ఈ కూ యాప్ ఇప్పుడు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ యాప్ పై పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు.

Also Read: గ్రేటర్ పీఠంపై కమలం కన్ను.. !

కూ యాప్ ను ప్రమోట్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు ట్విట్టర్ స్పందించకపోవడంతో కూ యాప్ కు మొగ్గు చూపుతోంది. రైతు నిరసనలకు సంబంధించి కొందరు ట్విట్టర్ వేదికగా.. తప్పుడు ప్రచారాలకు దిగారు. దీంతో వారి ఖాతాలు మూసివేయాలని కేంద్రం ట్విట్టర్ ను కోరగా.. సంస్థ పెడచెవిన పెట్టింది.పాకిస్తాన్ లేదా.. ఖలిస్తాన్ లకు సానుభూతిపరులకు సంబంధించిన 1000 ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని కోరుతూ ట్విట్టర్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సంస్థ స్పందించలేదు. అదే సమయంలో భారత్ లో ట్విట్టర్ సంస్థ పాలసీ హెడ్ మహిమా కౌల్ కూడా రాజీనామా చేశారు.

ట్విట్టర్ ను భారత్లో సస్పెండ్ చేయాలని పలు కథనాలు మీడియాలో వచ్చాయి. అంతేకాదు పలువురు కేంద్ర మంత్రులు, ప్రభుత్వ సంస్థలు ట్విట్టర్ ప్రత్యామ్నాయంగా దేశీయాప్ కూలో ఖాతాలు తెరవడం ద్వారా ట్విట్టర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కూ యాప్ కూడా ట్విట్టర్ ను పోలి ఉంటుంది. గతేడాది మర్చిలో దీన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకొచ్చిన ఆత్మ నిర్బర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్ లో కూ యాప్ తొలివరుసలో నిలిచింది. అప్పటి నుంచి మిలియన్ల మంది దీన్నివాడుతున్నారు. భారతీయులు కూడా కూ యాప్ ను వాడాలని పీఎం పిలుపునిచ్చారు.

Also Read: భారత్ కు అరుదైన గౌరవాన్ని ఇచ్చిన అమెరికా

కూ యాప్ ను అప్రయేయ రాధాకృష్ణ, మయాంక్ బిద్వాక్తలు రూపొందించారు. ఇది ప్రధానంగా నాలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. తెలుగు, హిదీ, కన్నడ, తమిళ భాషల్లో ఉండగా.. త్వరలో మరాఠి, గుజరాతీ, పంజాబీ, బంగ్లా, ఒరియా, మళయాళం, అస్సామీ భాషల్లో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూ యాప్ ద్వారా యూజర్లు టెక్ట్స్ మెసేజ్లు, వీడియోలు, ఆడియోలు పంపే అవకాశం ఉంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ లలో లభిస్తుంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్