https://oktelugu.com/

లేడీ కస్టమర్ కు షాకిచ్చిన డెలివరీ బాయ్.. ఏం చేశాడంటే..?

ప్రపంచ దేశాల్లో రోజురోజుకు ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే అవకాశం ఉండటంతో ఎక్కువమంది ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే అలా ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక లేడీ కస్టమర్ కు డెలివరీ బాయ్ భారీ షాక్ ఇచ్చాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ మొత్తం తినేసి లేడీ కస్టమర్ ను షాకయ్యేలా చేశాడు. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 10, 2021 / 05:07 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాల్లో రోజురోజుకు ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే అవకాశం ఉండటంతో ఎక్కువమంది ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే అలా ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక లేడీ కస్టమర్ కు డెలివరీ బాయ్ భారీ షాక్ ఇచ్చాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ మొత్తం తినేసి లేడీ కస్టమర్ ను షాకయ్యేలా చేశాడు.

    Also Read: పెళ్లిలో బాసికం ఎందుకు కడతారో తెలుసా?

    పూర్తి వివరాల్లోకి వెళితే లండన్ కు చెందిన ఇల్లీ ఇలీస్‌ అనే 21 సంవత్సరాల వయస్సు గల యువతి ఆన్ లైన్ లో ఊబర్ ఈట్స్ యాప్ సహాయంతో చిప్స్‌, చికెన్‌ వ్రాప్స్, రెండు బర్గర్లను ఆర్డర్ చేశారు. ఇల్లీ ఇలీస్‌ ఆర్డర్ చేసిన ఫుడ్ విలువ మన దేశ కరెన్సీ ప్రకారం 1,500 రూపాయలు. ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల తరువాత ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ దారిలో ఉందని సదరు యువతికి నోటిఫికేషన్ వచ్చింది. ఆ తరువాత డెలివరీ బాయ్ మీకు దగ్గరలోనే ఉన్నాడంటూ యువతికి మరో నోటిఫికేషన్ వచ్చింది.

    Also Read: స్టాక్ మార్కెట్లో రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేసిన బుడతడు.. చివరకు..?

    మరికొన్ని నిమిషాల్లో ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుందని భావించిన ఇల్లి ఇలీస్ కు డెలివరీ బాయ్ నుంచి “సారీ లవ్‌! నేను నీ ఫుడ్‌ తినేశాను” అంటూ మెసేజ్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి మెసేజ్ వస్తే ఎవరైనా డెలివరీ బాయ్ పై ఫిర్యాదు చేస్తారు. మెసేజ్ వచ్చే సమయానికి ఊబర్ ఈట్స్ యాప్ లో ఫుడ్ డెలివరీ అయినట్లు ఉంది. అయితే యువతి మాత్రం డెలివరీ బాయ్ కు నిజంగా ఆకలిగా ఉండవచ్చని అందువల్లే అతను తిని ఉంటాడని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    తాను ఫిర్యాదు చేస్తే డెలివరీ బాయ్ ఉద్యోగం పోతుందని కరోనా కష్ట కాలంలో డెలివరీ బాయ్ ఉద్యోగం పోవడానికి తాను కారణం కావడం తనకు ఇష్టం లేదని ఆమె అన్నారు. డెలివరీ బాయ్ పెట్టిన మెసేజ్ తనకు నవ్వు తెప్పించిందని అతనిని తాను క్షమించేశానని ఇల్లీ ఇలిస్ చెప్పుకొచ్చారు.