
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నిధులు.. నీళ్లు.. నియామకాలపై ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిసారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి మరీ వేలకోట్లతో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టింది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కేవలం మూడేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి కాల్వలకు, పంట పొలాలకు సాగునీరు అందిస్తున్నారు.
ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?
సీఎం కేసీఆర్ ఇటీవలే సిద్ధిపేట జిల్లాలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. మర్కుజ్ మండలంలోని వెంకటాపురం శివారులో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును వేదమంత్రోచ్ఛరణ మధ్య సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెల్సిందే. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీటిని కాల్వల ద్వారా తరలిస్తున్నారు. అయితే తాజాగా కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండిపడటం ఆందోళన కలిగిస్తుంది. సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్ పూర్, ఆలేరు నియోజకవర్గాల్లోని చెరువులను నింపేందుకు నీటిని తరలిస్తున్న క్రమంలో కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండిపడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టులోని నీళ్లలన్నీ గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతోన్నారు.
వైసీపీలో విజయసాయిరెడ్డి సీన్ ముగిసిందా?
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు కట్టబెట్టింది. ప్రాజెక్టులోని ప్రధాన పనులన్నింటిని మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. మేఘా సంస్థ నాణ్యతలోపంతో నిర్మాణాలు చేపట్టినందువల్లే కొండపోచమ్మ సాగర్కు గండిపడిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, మేఘా సంస్థ పనితీరుపై రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గండిపడి ఊళ్లోలోకి వస్తున్న నీళ్లను వీడియోలు తీసీ సోషల్ మీడియాలో పెడుతూ పలువురు వైరల్ చేస్తున్నారు.
ఇదిలా కొండపోచమ్మసాగర్ కాల్వ పనుల్లో కొన్ని పనులను ప్రభుత్వం స్థానికంగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. సదరు కాంట్రాక్టర్లు నాణ్యతలోపంతో నిర్మించడంతోనే కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టులో ప్రధాన పనులు చేపట్టిన మేఘా సంస్థ ఈ పనులను పర్యవేక్షించకపోవడం వల్లనే గండిపడిందని పలువురు ఆరోపిస్తున్నారు. కాల్వగండిపై ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సిందే..!