ఇద్దరు సీఎంలను టార్గెట్‌ చేసిన కొండా సురేఖ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి ప్రస్తావన ఒక శఖంలాంటిది. పాదయాత్రతో పేదలను పలకరించి.. గ్రామాల్లోనే సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌‌ ఇప్పటికీ అందరి గుండెల్లో నిలిచిపోయారు. వైఎస్సార్‌‌ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన కేబినెట్‌లో ఎంత మంది ఉన్నా కొందరితే సన్నిహితంగా ఉండేవారు. Also Read: నేలవిడిచి సాము చేస్తున్న జగన్ తెలంగాణ నేతల్లో అంతటి సాన్నిహిత్యం సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌‌, కొండా సురేఖ, కొండా మురళి. ఈ నలుగురిలో ఇద్దరితో మాత్రం వైఎస్‌ […]

Written By: NARESH, Updated On : September 16, 2020 10:06 am

konda surekha

Follow us on


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి ప్రస్తావన ఒక శఖంలాంటిది. పాదయాత్రతో పేదలను పలకరించి.. గ్రామాల్లోనే సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌‌ ఇప్పటికీ అందరి గుండెల్లో నిలిచిపోయారు. వైఎస్సార్‌‌ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన కేబినెట్‌లో ఎంత మంది ఉన్నా కొందరితే సన్నిహితంగా ఉండేవారు.

Also Read: నేలవిడిచి సాము చేస్తున్న జగన్

తెలంగాణ నేతల్లో అంతటి సాన్నిహిత్యం సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌‌, కొండా సురేఖ, కొండా మురళి. ఈ నలుగురిలో ఇద్దరితో మాత్రం వైఎస్‌ కుటుంబంతో ఆర్థిక లావాదేవీలు ఉండేవట. వారే కొండా దంపతులు. వైఎస్సార్‌‌ మరణం వరకు కాంగ్రెస్‌లోనే ఉండి పదవులు అనుభవించారు.

వైఎస్‌ మరణానంతరం ఆయన కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో జగన్‌కు కూడా కొండా దంపతులు ఎంతో అండగా నిలిచారు. తెలంగాణ ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్న జగన్‌తోనే వైసీపీలోనే ఉండిపోయారు. ఉద్యమం సమయంలో మానుకోట సంఘటన సందర్భంగా మురళి గులాబీ శ్రేణులపై గన్‌ పేల్చి కలకలమే సృష్టించాడు. ఈ ఘటనకు ప్రతిగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కొండా వర్గంపై రాళ్ల వర్షం కురిపించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తరువాత వైఎస్‌ జగన్‌తో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా కొండా జంట వైసీపీని వీడింది. ఆ త‌రువాత టీఆర్‌ఎస్‌ పక్షాన చేరారు. కేసీఆర్‌‌తోనూ మనస్పర్థలు రావడంతో పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చారు. మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు.

Also Read: కెసిఆర్ గారూ, మరీ ఇంత పచ్చి అబద్దాలా?

ఎప్పుడూ కుమ్ములాటలతో నడిచే కాంగ్రెస్‌ పార్టీలోనూ కొండా దంపతులు ఇమడలేకపోయారు. వీరికి అంతగా ప్రాధాన్యం దక్కకపోవడంతో మౌనం వహించారు. తాజాగా.. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సంచలన విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌లా మారింది. ‘ఒక‌ప్పుడు బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న వైఎస్ జ‌గ‌న్‌, కేసీఆర్ ఎలా క‌లిశారు. అప్పుడు జగన్‌ను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడెందుకు వెన‌కేసుకొస్తున్నారు’ అంటూ మండిప‌డుతున్నారు. ఇరిగేష‌న్ ప్రాజెక్టులు క‌డుతూ తెలంగాణకు జ‌గ‌న్ అన్యాయం చేస్తుంటే కేసీఆర్ చూసీచూడ‌న‌ట్టు నడుచుకుంటున్నారని, వీరిద్దరి మ‌ధ్యలో లోపాయికారి ఒప్పందం జ‌రిగింద‌ని ఘాటు విమర్శలు చేశారు. ఉన్నట్టుండి సురేఖ స్వరం మార్చడం, త‌న వ్యాఖ్యల‌కు ప‌దును పెట్టడం వెన‌క రాజ‌కీయంగా ఆంతర్యం ఏంటో అర్థం కాకుండా ఉంది. అయితే.. రాజకీయంగా తమ ఉనికిని చాటేందుకే ఇలా చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.