https://oktelugu.com/

కాంగ్రెసోళ్లు ఈ ఫొటో చూస్తే పండుగ చేసుకుంటారు

కాంగ్రెస్ లో ఇప్పుడు నిప్పు లేకున్నా పొగ వస్తోంది.. టీపీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ రాజ్యమేలుతోంది. అటు కోమటిరెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి బ్యాచ్ ఢిల్లీలో లాబాయింగ్ చేస్తుంటే ఎవరికి పీఠం ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది. Also Read: కొత్త సంవత్సరం వేళ.. వారికి తెలంగాణ సర్కార్‌‌ తీపి కబురు ఇంత వేడిలో సెగలు పొగలు కక్కుతున్న సమయంలో టీ కాంగ్రెస్ దిగ్గజ ముగ్గురు నేతలు కలిసికట్టుగా ఢిల్లీలో కనిపించడం కాంగ్రెస్ వాదులకు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 24, 2020 8:12 pm
    Follow us on

    Congress Leaders

    కాంగ్రెస్ లో ఇప్పుడు నిప్పు లేకున్నా పొగ వస్తోంది.. టీపీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ రాజ్యమేలుతోంది. అటు కోమటిరెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి బ్యాచ్ ఢిల్లీలో లాబాయింగ్ చేస్తుంటే ఎవరికి పీఠం ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది.

    Also Read: కొత్త సంవత్సరం వేళ.. వారికి తెలంగాణ సర్కార్‌‌ తీపి కబురు

    ఇంత వేడిలో సెగలు పొగలు కక్కుతున్న సమయంలో టీ కాంగ్రెస్ దిగ్గజ ముగ్గురు నేతలు కలిసికట్టుగా ఢిల్లీలో కనిపించడం కాంగ్రెస్ వాదులకు కనుల విందుగా అనిపించింది. నిజంగానే బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వీరు కనిపించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కళ్లు చల్లబడ్డాయి.

    ఇటీవల పీసీసీ కుర్చీ కోసం కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్ద లాబీయింగ్ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే అభిప్రాయ సేకరణ జరిపి ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రత్యర్థులు ఒక్కచోట చేరి ఇలా ఫొటోలకు ఫోజిస్తూ తామంతా కలిసే ఉన్నట్టుగా మెసేజ్ ఇవ్వడంపై కాంగ్రెస్ వాదులు ఆనందపడుతున్నారు.

    Also Read: ఫామ్‌హౌస్‌ సీఎం ఎక్కడ..?: ఇదే ఇప్పుడు బీజేపీ అస్త్రం

    ఢిల్లీలో మాత్రం సీన్ రివర్స్ గా కనిపిస్తోంది. నేతలంతా ఒక్కచోట చేరి బాగానే కలిసిపోయారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘మార్చ్’ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగడం కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిసైతం ఒకే చోట కనిపించడంతో కాంగ్రెస్ వాదుల కళ్లు చల్లబడ్డాయి. వీరంతా ఫొటోలకు పోజులిచ్చారు. ఓకే చోట  కనిపించి విభేదాలను ప్రస్తుతానికైతే పక్కనపెట్టారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్