తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ముందు నుంచీ కాంగ్రెస్‌నే నమ్ముకొని ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మంత్రి పదవులను సైతం అనుభవించారు. చివరకు ఆయన పీసీసీ చీఫ్ కావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ.. ఆ పదవి మాత్రం ఆయనను ఊరిస్తూనే ఉంది. పీసీసీ పదవి తీసుకొని.. తన ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలనేది కోమటిరెడ్డి లక్ష్యం. అధిష్టానం తనకు ఆ పదవిని అప్పగిస్తే కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొనడమే కాదు.. సొంత పార్టీలోని నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తానని చెబుతున్నారు.
Also Read: అయోధ్య మసీదులో నమాజ్ చేసినా పాపమే.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న లీడర్. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సీనియర్ నేతలతో పొసగదు. ఎందుకంటే తన దారిలోనే అందరూ వెళ్లాలనుకునే మనస్తత్వం కోమటిరెడ్డిది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముందు నుంచీ వైరమే. ఇద్దరిదీ ఒకే జిల్లా కావడం ఆధిపత్యం కోసం ప్రయత్నించడమే విభేదాలకు, వివాదాలకు కారణంగా చెప్పాలి.
ఇక కాంగ్రెస్‌లోని మరో సీనియర్ లీడర్ జానారెడ్డి. ఈయన అంటే కూడా కోమటిరెడ్డికి పడదు. ఈ ముగ్గురిదీ ఒకే జిల్లా కావడంతో.. సాధారణంగా ఆ జిల్లాలో ముందు నుంచి మూడు గ్రూపులు నడుస్తున్నాయి. నల్లగొండ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఆయన మనసంతా పీసీసీ పీఠంపైనే ఉంది.
Also Read: నిమ్మగడ్డది నడవదంతే.. కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ
ఎలాగైనా పీసీసీ పీఠం దక్కించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి ఎంపిక వాయిదా పడటంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కోమటిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో జానారెడ్డి గెలవకుంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. జానారెడ్డి గెలుపు కోసం ఆయన నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఇక్కడ జానారెడ్డి గెలుపులో ప్రధానపాత్ర పోషించి పీసీసీ చీఫ్ పదవికి చేరువవ్వాలన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్‌గా తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్