https://oktelugu.com/

సమ్మర్ కి సిద్దమైన మరో రెండు సినిమాలు

టాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాల విడుదల తేదీల్ని ప్రకటించి ప్రేక్షకులకి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు మేకర్స్. చూస్తుంటే… ఈ సమ్మర్ లో ఎంటర్టైన్మెంట్ కి ఢోకా ఉండదని అనుకోవచ్చు. కరోనా కల్లోలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక సడలింపులతో థియేటర్ లలో సినిమాలని విడుదల చేసుకోవచ్చని ఆదేశాల జారీ చేయటంతో దర్శక నిర్మాతలు ఆచి తూచి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. Also Read: థ్యాంక్ యూ బ్రదర్’ ట్రైలర్ టాక్: లిఫ్ట్ లో ఇరుక్కున్న అనసూయ […]

Written By:
  • admin
  • , Updated On : January 29, 2021 / 09:46 AM IST
    Follow us on


    టాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాల విడుదల తేదీల్ని ప్రకటించి ప్రేక్షకులకి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు మేకర్స్. చూస్తుంటే… ఈ సమ్మర్ లో ఎంటర్టైన్మెంట్ కి ఢోకా ఉండదని అనుకోవచ్చు. కరోనా కల్లోలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక సడలింపులతో థియేటర్ లలో సినిమాలని విడుదల చేసుకోవచ్చని ఆదేశాల జారీ చేయటంతో దర్శక నిర్మాతలు ఆచి తూచి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.

    Also Read: థ్యాంక్ యూ బ్రదర్’ ట్రైలర్ టాక్: లిఫ్ట్ లో ఇరుక్కున్న అనసూయ

    వచ్చే నెల నుండి పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్స్ ని నడుపుకోవచ్చని ప్రకటన రావటంతో మేకర్స్ కూల్ గా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్, టాక్ జగదీష్, లవ్ స్టోరీ లాంటి బిగ్ మూవీస్ ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవగా వేణు ఊడుగుల డైరక్షన్ లో రానా,సాయి పల్లవి కంబినేషన్లో వస్తున్న ‘విరాట పర్వం’ మూవీ కూడా ఏప్రిల్ 30న విడుదలవుతున్నట్లుగా ప్రకటించారు.

    Also Read: ఆచార్య టీజర్ రెడీ.. అదరిపోవడం ఖాయం !

    ఈ క్రమంలోనే వెంకటేష్-మెగా హీరో వరుణ్ తేజ్ క్రేజీ కాంబోలో అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా ఆగష్టు 27న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేసారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ 2019 లో విడుదలయి భారీ హిట్ అయిన ” ఎఫ్-2 ” కి సీక్వెల్ గా వస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా ఇబ్బడి ముబ్బడిగా అన్ని సినిమాలు విడుదలవుతుంటే కలెక్షన్స్ మీద ప్రభావం గట్టిగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్