Komatireddy Brothers To Join BJP: కోమటిరెడ్డి బ్రదర్స్ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ కు టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పటి నుంచే వీరు పార్టీలో తీవ్ర అసహనంగా ఉంటున్నారు. గతంలో రాజగోపాల్ రెడ్డి అయితే బహిరంగంగానే బీజేపీలో చేరుతానంటూ ప్రకటించారు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు పార్టీని వీడే విషయంపై స్పందించలేదు.
కానీ అనూహ్యంగా రీసెంట్ గా ప్రధాని మోడీని కలిసి చర్చించడం సంచలనం రేపుతోంది. సీఎంలకు కూడా సరిగ్గా అపాయింట్ మెంట్ ఇవ్వని మోడీ.. ఓ ఎంపీకి అడగ్గానే అపాయింట్ మెంట్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. అదే సమయంలో అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి కేంద్రాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. దీంతో ఇద్దరూ కలిసి ఒకే స్టాండ్ తీసుకున్నట్టు అర్థం అవుతుంది.

మొన్న ఐదు రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత బీజేపీ జోష్ ఏ స్థాయిలో ఉందో వారికి అర్థమైపోయినట్టుంది. పైగా రాష్ట్రంలో కూడా కాంగ్రస్ పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా తయారవుతోంది. కాబట్టి తాము బీజేపీలో చేరితో ఉమ్మడి నల్గొండలో కాషాయదళానికి తామే పెద్ద దిక్కు అవుతామంటూ అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఉమ్మడి జిల్లాలో అలాగే రాష్ట్రంలో తమకు తిరుగుండదని భావిస్తున్నారు.
Also Read: RRR Movie: రామరాజు పాత్రకు చరణ్ ను, భీమ్ పాత్రకు తారక్ ను తీసుకోవడానికి కారణం ఇదే..
ఇందుకోసం అన్ని రకాలుగా బీజేపీ ముందు డిమాండ్లు పెట్టి తమకు అనుకూలంగా ఉంటేనే వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అన్నీ కుదిరితే త్వరలోనే వీరు ప్రధాని మోదీ, అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వీరిని బీజేపీలోకి తీసుకు వచ్చేందుకు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారంట. గతంలో ఈటల రాజేందర్ ను బీజేపీలో పార్టీలో చేర్చడంలో వీరు ముందుండి అన్నీ చూసుకున్నారు.
ఒకవేళ కోమటి బ్రదర్స్ గనక కాంగ్రెస్‌ను వీడితే.. ఆ పార్టీ ఉమ్మడి నల్గొండలో పాతాలానికి పడిపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లా నల్గొండ మాత్రమే. కాబట్టి వారిని కూడా దూరం చేసుకుంటే మాత్రం మరో పదేండ్లు వెనక్కు వెళ్లిపోతోంది. మరి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: CM Jagan Meeting with MLAs: వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ సర్వే ఫీవర్.. పేరు వస్తేనే టికెట్
[…] Also Read: Komatireddy Brothers To Join BJP : కాషాయ గూటికి కోమటిరెడ్… […]