Komatireddy Venkat Reddy: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటానికి కూడా కారణాలు అనేకం ఉన్నాయని తెలుస్తోంది. కానీ వాటిని తెలియజేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. కానీ మొత్తానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వెనుక పెద్ద హైడ్రామా నడిచినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మనుగడ కోల్పోయినందు వల్లే ఆయన పార్టీ మారినట్లు వార్తలు వస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ముభావంగానే ఉన్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకు గట్టిగా నిర్ణయించుకున్నాకే రాజీనామా చేసినట్లు సమాచారం.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనందున కాంగ్రెస్ పార్టీ కూడా దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరె్డి వెంకటరెడ్డి, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలతో ఓ కమిటీ వేసి వారు మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాల్సిందిగా బాధ్యతలు అప్పగించింది. దీంతో దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు వెంకటరెడ్డి సోదరుడి ఓటమికి పాటుపడతారా అనేది సందేహమే. అన్న కాంగ్రెస్ లో తమ్ముడు బీజేపీలో ఉంటూ నాటకాలు ఆడుతున్నారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వారే విమర్శలు చేయడం తెలిసిందే.
Also Read: America Secret Weapons: అమెరికా అమ్ముల పొదిలో రహస్య ఆయుధాలు.. అల్ జవహరీ హత్యతో వెలుగులోకి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. కన్నతల్లికి ద్రోహం చేసే గుణం ఉన్న వారే ఇలాంటి పనులు చేస్తారని బహిరంగంగా విమర్శలు చేయడంతో రాజగోపాల్ రెడ్డి కూడా స్పందిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీలు మారడంపై చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెబుతున్నారు. కోడలికి బుద్ధి చెప్పి ఎవరితోనో పోయినట్లుగా ఉందని కౌంటర్ ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఆయన గెలుపు సునాయాసమే కానుందని తెలుస్తోంది.

తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఓటమికి అన్న ప్రచారం చేస్తారా అనేది సందేహాత్మకమే. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరుకున పెట్టేందుకు ఈ కమిటీలో ఆయన పేరు చేర్చినట్లు తెలుస్తోంది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన పనికి అన్న వెంకటరెడ్డి బాధ్యుడిగా నిలవాల్సి వస్తోంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో. అటు తమ్ముడు ఇటు పార్టీ రెండు ముఖ్యమే. దేన్ని కాదనలేని వెంకటరెడ్డి తరువాత తీసుకునే నిర్ణయం ఏమిటనే దానిపైనే వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించి అధిష్టానం చోద్యం చూస్తుందని చెబుతున్నారు.
Also Read:KA Paul: తెలంగాణ సీఎంగా నేను.. ఏపీ సీఎంగా మహిళా నేత…కేఏ పాల్ మళ్లీ ఏశాడు