https://oktelugu.com/

Kajal Agarwal: ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన కాజల్ అగర్వాల్…

Kajal Agarwal: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ … కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ … ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇటీవల పెళ్లి అయిన కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుందంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. మరోవైపు భర్త గౌతమ్‌ కిచ్లు తో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. ఇదిలా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 9, 2021 / 05:03 PM IST
    Follow us on

    Kajal Agarwal: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ … కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ … ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇటీవల పెళ్లి అయిన కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుందంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. మరోవైపు భర్త గౌతమ్‌ కిచ్లు తో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా కాజల్‌ ప్రెగ్నెన్సీ రూమర్స్ సోషల్‌ మీడియాలో ఊపందుకున్నాయి. కాజల్‌, గౌతమ్‌ కిచ్లు కలిసి పిల్లలకు ప్లాన్‌ చేస్తున్నారని, ప్రస్తుతం కాజల్‌ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతుంది.

    అయితే తాజాగా కాజల్‌ ప్రెగ్నెన్సీ రూమర్స్ పై కాజల్‌ చెబుతూ, సరైన సమయంలో దాని గురించి మాట్లాడతా అని చెప్పింది. ప్రెగ్నెన్సీ రూమర్స్ పై నెలకొన్న సస్పెన్స్ కి ఫుల్‌స్టాప్‌ పెట్టలేదు కదా, దాన్ని మరింతగా పెంచింది. గర్భం దాల్చకపోయి ఉంటే అలాంటిదేమీ లేదు, ఇంకా ప్లాన్‌ చేయలేదు అనే సమాధానం చెప్పేది. కానీ అలా స్పందించలేదు. సరైన సమయంలో స్పందిస్తానని చెప్పడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తలకు మరింత ఊతమిచ్చినట్టయ్యింది.
    కాజల్‌ చివరగా `మోసగాళ్లు` చిత్రంలో నటించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన `ఆచార్య` చిత్రంలో నటించింది. మరోవైపు నాగార్జునతో `ఘోస్ట్` సినిమా చేస్తుంది. తమిళంలో రెండు సినిమాలు పూర్తి చేసుకుంది. హిందీలో ఓ సినిమా చేస్తుంది. కొత్త సినిమాలపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం ఈ వార్త సోకైల్ మీడియాలో వైరల్ గా మారింది.