తెలంగాణ బిజెపి అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి మోకాలడ్డు!

తెలంగాణలో నూతన బిజెపి అధ్యక్షుడి నియామకంలో జరుగుతున్న అసాధారణ జాప్యానికి కేంద్ర సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. బలమైన నాయుడుని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా చేస్తే తన ప్రాధాన్యత తగ్గిపోతుందని అడ్డు పడుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకనే ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్న ప్రస్తుత అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ కొనసాగింపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా తన సామాజిక వర్గం నుండి ఈ పదవి కోసం ప్రయత్నం […]

Written By: Neelambaram, Updated On : March 4, 2020 1:59 pm
Follow us on

తెలంగాణలో నూతన బిజెపి అధ్యక్షుడి నియామకంలో జరుగుతున్న అసాధారణ జాప్యానికి కేంద్ర సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. బలమైన నాయుడుని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా చేస్తే తన ప్రాధాన్యత తగ్గిపోతుందని అడ్డు పడుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకనే ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్న ప్రస్తుత అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ కొనసాగింపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ముఖ్యంగా తన సామాజిక వర్గం నుండి ఈ పదవి కోసం ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి డి కె అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి లకు పార్టీ సారధ్యం లభించకుండా జాగ్రత్త పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరైనా మంచి వనరులు ఉన్నవారు కావడంతో తెలంగాణలో బలమైన నాయకులుగా ఎదిగి, భవిష్యత్ లో తన మంత్రి పదవికీ కూడా ఎసరు పెట్టవచ్చని జంకుతున్నట్లు చెబుతున్నారు.
ను సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీకి, తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి తాను ఎమ్యెల్యేగా గెలుపొందిన అంబర్ పెట్ కె పరిమితమయ్యేవారనే ఆరోపణలున్నాయి.

పైగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి బలమైన కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి పార్టీ నుండి వెళ్లిపోవాలని కిషన్ రెడ్డి `సహాయ నిరాకరణే’ కారణం అని తెలుస్తున్నది. ఇక. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలు నేరుగా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షా వద్దకే వెళ్లాయి. మీడియా సమావేశాలకు తప్పా ప్రజలలోకి పార్టీని తీసుకు వెళ్లడంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ విఫలం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.