https://oktelugu.com/

పవన్, మహేష్ లను టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్

ఒకప్పుడు హీరో స్టామినా అనేది సినిమా ఎన్నిరోజులు ఆడింది.. ఎన్ని థియేటర్లలో ప్రదర్శించారు.. ఎన్ని కలెక్షన్లు సాధించింది.. అనే దానిపై అంచనా వేసేవారు. సోషల్ మీడియా వచ్చాక హీరో స్టామినా విషయంలో లెక్కలు మారిపోయాయి. హీరోలకు వాళ్లకు ఫ్యాన్సే బలం.. వాళ్లకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటే అంత క్రేజ్. అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ హీరోలంతా తమ కోసం ఫ్యాన్స్ ఏం చేసినా ఎంజాయ్ చేస్తుంటారు. Also Read: మరోసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటున్న టాలీవుడ్? ఇక […]

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2020 / 12:59 PM IST

    mahes pawan

    Follow us on

    ఒకప్పుడు హీరో స్టామినా అనేది సినిమా ఎన్నిరోజులు ఆడింది.. ఎన్ని థియేటర్లలో ప్రదర్శించారు.. ఎన్ని కలెక్షన్లు సాధించింది.. అనే దానిపై అంచనా వేసేవారు. సోషల్ మీడియా వచ్చాక హీరో స్టామినా విషయంలో లెక్కలు మారిపోయాయి. హీరోలకు వాళ్లకు ఫ్యాన్సే బలం.. వాళ్లకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటే అంత క్రేజ్. అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ హీరోలంతా తమ కోసం ఫ్యాన్స్ ఏం చేసినా ఎంజాయ్ చేస్తుంటారు.

    Also Read: మరోసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటున్న టాలీవుడ్?

    ఇక తమ అభిమాన హీరో పుట్టిన రోజు వచ్చిందంటే ఫ్యాన్స్ హడావుడి మాములుగా ఉండదు. ఒకప్పుడు థియేటర్ల ముందు పెద్దపెద్ద కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు.. కేక్ కటింగ్.. అన్నదానాలు.. రక్తదానాలు వంటి చేసేవారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడంతా అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో పేరుతో # ట్యాగులు, డీపీలతో ట్రెండ్ సెట్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు.

    ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేశారు. # ట్యాగులతో సోషల్ మీడియాను హీటెక్కించారు. మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియా టాప్ ట్రెండింగ్ లోకి అభిమానులు తీసుకొచ్చారు. అదేవిధంగా పవన్ పుట్టిన రోజుకు కొన్నివారాల ముందే అభిమానులు # ట్యాగులను ట్రెండింగులోకి తీసుకొచ్చారు. పవన్ పుట్టినరోజు నాటికి 6.5 కోట్ల(65 మిలియన్ల)సార్లు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పారు.

    Also Read: తల్లిదండ్రుల పై సుధీర్ బాబు ఎమోషనల్ ట్వీట్ !

    తాజాగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. ప్రభాస్ పుట్టిన రోజుకు 41రోజులుగా ముందుగానే #41DaysToREBELSTARBDay అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు ఉండగా నిన్న సాయంత్రం 6గంటల నుంచే సోషల్ మీడియాలో # ట్యాగులను ప్రారంభించారు. ఇప్పటికే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో దాదాపు 50 లక్షల (5 మిలియన్)సార్లు ట్రెండ్ అయ్యింది. దీంతో కొన్నిరోజుల్లో డార్లింగ్ # ట్యాగులతో సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగును బట్టి హీరోల స్టామినాను అంచనా వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్న తలెత్తోంది.