‘కరోనా’పై యుద్ధం ప్రకటించిన కిమ్!

చైనాలో పుట్టిన కరోనా రక్కసి ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తుందో.. అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఈ వైరస్ ఉత్తర, దక్షిణ కొరియా దేశాలను వణికిస్తోంది. దక్షిణకొరియా ఉపాధ్యక్షురాలికే ఈ వైరస్ సోకడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. దక్షిణ కొరియా కి వచ్చిన కరోనా.. ఉత్తర కొరియా లో కూడా అడుగు పెట్టె అవకాశాలు ఉండటంతో.. ఆ దేశ అధికారులు అప్రమతం అయ్యారు. ఈ క్రమంలో ఆ దేశ అధికారులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. […]

Written By: Neelambaram, Updated On : February 29, 2020 1:23 pm
Follow us on

చైనాలో పుట్టిన కరోనా రక్కసి ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తుందో.. అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఈ వైరస్ ఉత్తర, దక్షిణ కొరియా దేశాలను వణికిస్తోంది. దక్షిణకొరియా ఉపాధ్యక్షురాలికే ఈ వైరస్ సోకడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. దక్షిణ కొరియా కి వచ్చిన కరోనా.. ఉత్తర కొరియా లో కూడా అడుగు పెట్టె అవకాశాలు ఉండటంతో.. ఆ దేశ అధికారులు అప్రమతం అయ్యారు. ఈ క్రమంలో ఆ దేశ అధికారులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక వేళా ఈ వైరస్ ను ఆపడంలో ఉత్తరకొరియా అధికారులు విఫలం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.

చీమ కూడా తమ బార్డర్ దాటి లోపలి రావడానికి వీల్లేదు అని కిమ్ అధికారులకు తెలిపారు. అయితే కరోనా విషయం లో అజాగ్రత్త ఉన్నారని ఆరోపణలు రావడంతో అక్కడి అధికార వర్కర్స్ పార్టీ వైస్ ఛైర్మన్ రీ మాన్ గోన్, పాక్ తే డొక్ ను వారి పదవుల నుండి ఇప్పటికే తప్పించారు కిమ్.

చైనాలో వెలుగుచూసిన ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు వ్యాపించింది. చైనా తర్వాత అత్యధికంగా కరోనా వైరస్ కేసులు దక్షిణ కొరియాలో నమోదుకావడం ఆ దేశం మరింత కలవరపడుతోంది. కరోనా బాధితుల సంఖ్య 2,931కి చేరింది. చైనాలో కరోనా కేసుల సంఖ్య 79,251కి చేరింది.