చిరంజీవి ఇంటి ముందు ఉద్రిక్తత!

ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. జగన్ మూడు రాజధానుల ప్రకటనకు చిరంజీవి మద్దతు తెలపడంతో అమరావతి జేఏసీ నాయకులు ఆయన ఇంటి ముట్టడికి ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు చిరు ఇంటి ముందు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. నివాసం దరిదాపుల్లోకి ఎవరినీ రాకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున చిరు నివాస ప్రాంతానికి చేసుకున్నారు. చిరంజీవికి మద్దతుగా నినాదాలు […]

Written By: Neelambaram, Updated On : February 29, 2020 1:29 pm
Follow us on


ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. జగన్ మూడు రాజధానుల ప్రకటనకు చిరంజీవి మద్దతు తెలపడంతో అమరావతి జేఏసీ నాయకులు ఆయన ఇంటి ముట్టడికి ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు చిరు ఇంటి ముందు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. నివాసం దరిదాపుల్లోకి ఎవరినీ రాకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున చిరు నివాస ప్రాంతానికి చేసుకున్నారు. చిరంజీవికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. మెగాస్టార్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు.

గతంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంటి దగ్గర కూడా టెంట్లు వేసి అమరావతి రైతులు ఆందోళనలు నిరసన దీక్షలు చేపట్టారు. ఏపీ రాజధాని అంశంపై మహేష్ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే చిరు మాత్రం జగన్ మూడు రాజధానుల ప్రకటనకు చిరంజీవి మద్దతు పలికిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను ఆయన స్వాగతించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం కాబట్టి మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని చిరంజీవి కోరారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేలా జీఎన్ రావు కమిటీ సిఫార్సులు ఉన్నాయని చిరంజీవి అభిప్రాయపడ్డారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని గుర్తు చేసిన చిరంజీవి. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే.. ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయన్నారు.

అయితే చిరంజీవి ఇంటి ముట్టడికి అమరావతి జేఏసీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు మీడియా కి తెలిపారు