https://oktelugu.com/

కాళీమాత, ఎంఐఎం.. అగ్గిరాజేసిన రాజాసింగ్

తెలంగాణలో మొన్నటిదాకా ఉన్నది ఒకే ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పుడు ఇద్దరు అయ్యారు. అయితే ఒక్క రాజాసింగ్ హైదరాబాద్ అంతా కవర్ చేస్తున్నాడు. ముఖ్యంగా హిందుత్వ భావజాలంతో దేన్నైనా ఎదుర్కొంటున్నాడు. ఎంఐఎం అంటేనే ఒంటికాలిపై లేచే రాజాసింగ్ తాజాగా కాళీ మాత ఆలయాన్ని ఎంఐఎం కబ్జా చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇవిప్పుడు వైరల్ అయ్యాయి. Also Read: అక్కడ పోటీలో కాషాయమేనా? రాజాసింగ్ తాజాగా మరోసారి కేసీఆర్, ఎంఐఎం నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్, […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2020 / 06:30 PM IST
    Follow us on

    తెలంగాణలో మొన్నటిదాకా ఉన్నది ఒకే ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పుడు ఇద్దరు అయ్యారు. అయితే ఒక్క రాజాసింగ్ హైదరాబాద్ అంతా కవర్ చేస్తున్నాడు. ముఖ్యంగా హిందుత్వ భావజాలంతో దేన్నైనా ఎదుర్కొంటున్నాడు. ఎంఐఎం అంటేనే ఒంటికాలిపై లేచే రాజాసింగ్ తాజాగా కాళీ మాత ఆలయాన్ని ఎంఐఎం కబ్జా చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇవిప్పుడు వైరల్ అయ్యాయి.

    Also Read: అక్కడ పోటీలో కాషాయమేనా?

    రాజాసింగ్ తాజాగా మరోసారి కేసీఆర్, ఎంఐఎం నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్, ఎంఐఎంతో పోతే గ్రేటర్ ప్రజలు ఏం చేశారో చూశారు కదా అని రాజాసింగ్ మండిపడ్డారు.. వాళ్లతో వెళితే మీరు సర్వనాశనం అవ్వడం ఖాయం అని ఆరోపించారు. మహిళలలు అని కూడా చూడకుండా లాఠీచార్జీ చేశారు.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే అని పోలీసులను ప్రశ్నించారు రాజాసింగ్.

    కాళీ మాత ఆలయాన్ని ఎంఐఎం నేతలు కబ్జా చేయాలని చూస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో 3 సార్లు వేలం వేయడానికి ప్రయత్నం చేస్తే స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారని వివరించారు. 8 ఎకరాల స్థలం, గజం 30వేల వరకు ఉంటుందని తెలిపారు. కానీ ఇప్పుడు నర్సింహారెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాడని వివరించారు.దేవాదాయ శాఖ అధికారులు కోర్టుకు హాజరు కాకుండా భూ కబ్జాకు సహకరించారంటూ రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు.

    Also Read: తెలంగాణ సరిహద్దుల్లో మహారాష్ట్ర రైతుల ఆందోళన.. దేనికోసం?

    దేవాలయ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ఎండోమెంట్ మినిస్టర్ ఏసీలో పడుతున్నాడా? అంతూ తీవ్రంగా దుయ్యబట్టాడు. మొత్తంగా హైదరాబాద్ లో కాళీ మాత ఆలయాన్ని ఎంఐఎం నేతలు కబ్జా చేశారన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనమయ్యాయి. ఎంఐఎం నేతలను మరోసారి వివాదాస్పద అంశంలో రాజాసింగ్ ఇరికించేశారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్