Telangana Assembly Election: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన రెండు జాబితాల్లో అగ్రవర్ణాలకే ఎక్కువ స్థానాలు దక్కాయి. 50 శాతం ఉన్న బీసీలకు వంద స్థానాల్లో కేవలం 20 మాత్రమే దక్కాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అధిష్టానం కులాల దామాశాతో సంబంధం లేకుండా గెలుపును దృష్టిలో పెట్టుకుని టికెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు బీసీలకు టికెట్లు ఇవ్వడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి జాబితాలో 12 మంది బీసీలు, రెండో జాబితాలో 8 మంది బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. మూడో జాబితాలో మరో ఐదారు గురికి టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక సెకండ్ లిస్ట్‌లో గెలుపు గుర్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 45 మందిలో 20 మంది కొత్తగా పార్టీలో చేరినవారే కావడం గమనార్హం. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్ ఈ క్రమంలో కీలక నియోజవర్గాలను మిస్ అయింది.
31 లోపు మూడో జాబితా..
ఇక కాంగ్రెస్ మరో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వచ్చే నెల 3న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లోనే మూడో లిస్ట్ రిలీజ్ అయ్యే చాన్స్ ఉందని సమాచారం. మొదటి జాబితాను 55 మంది అభ్యర్థులతో ఈ నెల 15న కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేసింది. తాజాగా 45 మంది అభ్యర్థులతో సెకండ్ లిస్టును శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
సర్వే ఆధారంగా టికెట్లు..
రెండో జాబితాలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ 12 రోజుల సమయం తీసుకుంది. ఇందులో కీలక చేతలు చంక్రం తిప్పినట్లు ఎతులుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌తోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ తమ అనుయాయులకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో రెండో జాబితాలో 20 మంది ప్యారాచూట్లకు టికెట్లు దక్కినట్లు తెలుస్తోంది. మరోవైపు సర్వే ఆధారంగా కూడా అభ్యర్థుల ఎంపిక జరిగిందని కాంగ్రెస్ అధిష్టానం చెబుతోంది.
పెండింగ్లో ఉన్న స్థానాలివే..
మిర్యాలగూడ, వైరా (సీపీఎంకు కేటాయించే అవ కాశం), చెన్నూరు, కొత్తగూడెం (సీపీఐకి కేటాయిం చినట్లు సమాచారం), పటాన్‌రు, అశ్వారావుపేట, తుంగతుర్తి, సూర్యాపేట, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, చార్మినార్, బాన్సువాడ, జుక్కల్, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మూడో జాబితా మరింత క్లిష్టంగా..
ఇక మూడో జాబితా ప్రకటన మరింత క్లిష్టంగా ఉంటుందని నాయకులు భావిస్తున్నారు. 15 స్తానాలకు ఒక్కో స్థానంలో ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు. పటాన్‌చెరు, నిజాబాబాద్ అర్బన్, కామారెడ్డి అభ్యర్థుల ఎంపిక కీలకం కానుంది. పటాన్‌చెరు నీలం మధుకు దాదాపు ఖరారైంది. అయితే ఇక్కడ శ్రీనివాస్‌గౌడ్‌ను అధిష్టానం ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. నిజామాబాద్ అర్బన్ మహేశ్‌గౌడ్ ఆశిస్తుండగా, ఇక్కడి నుంచి మైనారిటీ నేత షబ్బీర్ అలీని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కామారెడిడలో రేవంత్ బరిలో దిగుతారని తెలుస్తోంది. ఎలాంటి విమర్శలు రాకుండా గెలిచే చాన్స్ ఉన్నవారిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తుంది. ఇందుకు సర్వే రిపోర్టుతోపాటు, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. రెండో లిస్ట్‌లో గెలిచే చాన్స్ లేని కొందరు లీడర్లను నిర్మొహమాటంగానే పక్కన పెట్టింది.