Kalvakuntla Kavitha : అనుకున్నట్టుగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం, కేసుకు సంబంధించి వివరాలు కనుక్కునేందుకు ఆమెను విచారించారు. బంజరా హిల్స్ లో ఆమె ఇంటికి రాఘవేంద్ర వత్స తో కూడిన అధికారుల బృందం ఆదివారం వెళ్ళింది. సుమారు 5 గంటల పాటు ఆమెను విచారించింది. అధికారులు రావడం రావడంతోనే పోలీసు బలగాలు కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాయి. మీడియా హడావిడి లేకుండా బారి కేడ్లు ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా ఎవరినీ ఇంట్లోకి అనుమతించలేదు.
ఏం అడిగారు
అంతకుముందు డిసెంబర్ రెండో తేదీన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తనను విచారించుకోవచ్చని కవిత లేఖ రాశారు. ఆరో తేదీన రమ్మని కబురు పంపారు.. కానీ ఇంతలోనే ఆమె సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. పలువురు న్యాయ నిపుణుల సలహా మేరకు ఆమె సిబిఐ అధికారులకు మళ్లీ లేఖ రాశారు. ఆరోజు నాకు కుదరదు. 11, 13, 14 తేదీల్లో రావాలని పేర్కొన్నారు. దీంతో విచారణ అధికారులు కూడా 11 తారీఖు వస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆ తేదీ అనగా ఆదివారం నాడు వచ్చారు. ఐదు గంటల పాటు కవితను ఆమె ఇంట్లో విచారించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ ప్రక్రియలో ఆమె నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ముందుగానే ప్రశ్నలు రూపొందించుకుని రావడం, వాటిని అడగడంతో కవిత ఒకానొక దశలో ఇబ్బంది పడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ” అభిషేక్ రావు ఎవరు? మీకు ఎలా పరిచయం? ఆయన ఎలా తెలుసు? శరత్ చంద్రారెడ్డి మీకు ఎలా సహకరించారు? మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టాలని మీకు చెప్పింది ఎవరు? సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు మళ్ళించడంలో మీ పాత్ర ఏమిటి? సుమారు 10 ఆపిల్ ఐఫోన్లు ఎందుకు మార్చారు? పాత ఫోన్లు మీ దగ్గర ఉన్నాయా? లేక వాటిని ధ్వంసం చేశారా?” ఈ కోణాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం కవిత తెలివిగా సమాధానం చెప్పడంతో సిబిఐ అధికారులు ఒక అడుగు వెనక్కి వేసినట్టు తెలుస్తోంది. అయితే కవిత విచారణ అనంతరం ఒకింత విచారకరమైన ముఖంతో కనిపించారు.
ప్రగతి భవన్ వెళ్లే అవకాశం
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ పూర్తి చేసిన తరుణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేరుగా ప్రగతి భవన్ వెళ్లారు.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలిశారు. ఆ సమయంలో కొంతమంది న్యాయ నిపుణులు అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వీరి సూచన మేరకే కవిత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరారు. సిబిఐ అధికారులు కాపీ ఇచ్చిన తర్వాత అందులో తన పేరు లేకపోవడంతో కవిత విచారణ తేదీ మార్చారు. ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈరోజు విచారణ నిర్వహించారు.. అయితే విచారణ అనంతరం అధికారులు ప్రత్యేక వాహనాల్లో వెళ్లిపోయారు.. కెసిఆర్ తో కవిత భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ విచారణ అనంతరం రేపటి నాడు కవిత మీద సిబిఐ అధికారులు కేసు పెట్టి నిందితురాలుగా చేర్చితే ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చించినట్టు తెలుస్తోంది..
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Key questions in kalvakuntla kavitha cbi investigation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com