లాక్ డౌన్, కర్ఫ్యూపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా హైకోర్టు తీవ్ర స్వరంతో ప్రభుత్వం హెచ్చరించింది. తెలంగాణలో లాక్ డౌన్, కర్ఫ్యూపై మీరు నిర్ణయం తీసుకుంటారా? లేదా మేమే ఆదేశాలు ఇవ్వాలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించడం సంచలనమైంది. తెలంగాణలో దారుణమైన కరోనా పరిస్థితులు ఉన్నాయని హైకోర్టు మండిపడింది. దీనిపై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ర్యాలీలు, వివాహాలు, అంత్యక్రియల్లో రద్దీపై నియంత్రణలు ఎందుకు విధించడం లేదని.. ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం […]

Written By: NARESH, Updated On : April 19, 2021 9:39 pm
Follow us on

తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా హైకోర్టు తీవ్ర స్వరంతో ప్రభుత్వం హెచ్చరించింది. తెలంగాణలో లాక్ డౌన్, కర్ఫ్యూపై మీరు నిర్ణయం తీసుకుంటారా? లేదా మేమే ఆదేశాలు ఇవ్వాలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించడం సంచలనమైంది.

తెలంగాణలో దారుణమైన కరోనా పరిస్థితులు ఉన్నాయని హైకోర్టు మండిపడింది. దీనిపై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ర్యాలీలు, వివాహాలు, అంత్యక్రియల్లో రద్దీపై నియంత్రణలు ఎందుకు విధించడం లేదని.. ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం నింపలేకపోతోందని హైకోర్టు మండిపడింది.

కుటుంబమంతా కరోనా బారినపడితే ఏవిధంగా సాయం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీపీసీ పరీక్షలు రెండు రోజులైనా ఫలితాలు రావడం లేదని హైకోర్టు మండిపడింది. 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈనెల 22 లోగా అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఈనెల 22లోగా లాక్ డౌన్, కర్ఫ్యూపై నిర్ణయం తీసుకోకపోతే మిగతాది మేము చేస్తాం అని ఏజీపై హైకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరించింది. అనంతరం విచారణను 23కు వాయిదా వేసింది.