టీజర్ టాక్: ఏం కాలేక ‘గల్లీ రౌడీ’గా సందీప్

ఎప్పుడో పుష్కర కాలం క్రితం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ సరైన గ్రాండ్ హిట్ లేక బోటాబోటీ హీరోగానే మిగిలిపోయాడు సందీప్ కిషన్. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. తాజాగా సందీప్ కిషన్ , బాబీ సింహా హీరోలుగా జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహా శెట్టి హీరోగా నటిస్తోంది. ఈ చిత్రం టీజర్ ను రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విడుదల చేయడం విశేషం. సినిమా టైటిల్ కూడా […]

Written By: NARESH, Updated On : April 19, 2021 9:07 pm
Follow us on

ఎప్పుడో పుష్కర కాలం క్రితం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ సరైన గ్రాండ్ హిట్ లేక బోటాబోటీ హీరోగానే మిగిలిపోయాడు సందీప్ కిషన్. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు.

తాజాగా సందీప్ కిషన్ , బాబీ సింహా హీరోలుగా జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహా శెట్టి హీరోగా నటిస్తోంది. ఈ చిత్రం టీజర్ ను రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విడుదల చేయడం విశేషం. సినిమా టైటిల్ కూడా ‘గల్లీ రౌడీ’ కావడం గమనార్హం.

‘బాబు రావాలి..రౌడీ కావాలి.. అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం అలరిస్తుంది.. ఓ కిడ్నాప్ నేపథ్యంలో సాగే కథ ఇదీ అని తెలుస్తోంది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ పండించారు. రౌడీని చేయాలన్న తండ్రి సంకల్పం ఏంటో అర్తం కాకుండా చివర్లో ఆసక్తికరంగా ముగించారు.

ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.చౌరస్తా రామ్, సాయికార్తీక్ కలిసి సంగీతం అందిస్తున్నారు.