Prabhas -YCP MLA: డార్లింగ్ ప్రభాస్ అందరివాడు. ఆయన వ్యక్తిగతంగా రాజవంశానికి చెందిన వాడైనా.. గుణం కూడా అచ్చం ‘రాజు’లానే ఉంటుంది. తనతో ఉండేవారందరికీ కడుపు నిండా మంచి విందు భోజనం పెట్టడం అలవాటు. కృష్ణంరాజు వారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రభాస్.. ఆయనను మించి సేవాగుణాన్ని కలిగి ఉన్నారు.
తాజాగా పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ఆయన సొంతూరు మొగల్తూరులో సంస్మరణ సభను అభిమానుల కోసం ఏర్పాటు చేయించాడు ప్రభాస్. ఇందుకోసం హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు వచ్చారు. కృష్ణంరాజు, ప్రభాస్ ల సొంత గ్రామం మొగల్తూరులో ప్రభాస్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రజలు, అభిమానులకు మటన్, చికెన్ సహా విందుభోజనం ఏర్పాటు చేయించారు. దాదాపు 70వేల మంది ప్రజలకు సరిపడా ఈ భారీ విందును ఏర్పాటు చేయించి ప్రభాస్ తన ఉదారత చాటుకున్నారు.
Also Read: Pawan Kalyan- Chiranjeevi: పవన్ కళ్యాణ్ సీఎం అయితే చిరంజీవికి ఆ పదవి ఇస్తాడట
ఈ భారీ విందు కోసం.. కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం.. ప్రభాస్ ను చూడడానికి గోదావరి జిల్లాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రభాస్ ఇంటి వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలోనే అంతపెద్ద భారీ ఈవెంట్ కోసం వచ్చిన ప్రభాస్ ను లోకల్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కలిశారు. సంస్మరణ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభాస్ తో కలిసి కీలక భేటి నిర్వహించి ప్రభుత్వ పరంగా సాయం చేస్తున్నారు.
కృష్ణంరాజు బీజేపీలో కొనసాగారు. ఆయన కోసం కేంద్రంలోని బీజేపీ పెద్దలు వచ్చారు. ఇక ప్రభాస్ ను ఓదార్చారు. కానీ ప్రభాస్ ఎప్పుడూ బీజేపీ మనిషిగా మెదల్లేదు. అందరివాడుగా ఉన్నారు. అందుకే మొగల్తూరుకు ప్రభాస్ రాగానే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నేతలు కూడా ఆయనను ఓన్ చేసుకున్నారు. భేటి అయ్యి మొగల్తూరు సంస్మరణ సభ కోసం ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దగ్గరుండి మరీ ప్రభాస్ కు చేదోడువాదోడుగా ఉన్నారు.