Krishnam Raju Samsmarana Sabha: గోదావరి జిల్లాలంటే సినీ అభిమానంతో ఉప్పొంగుతాయి. ఇక్కడ హీరోలను దేవుళ్లలా కొలుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లలోని మొగల్తూరు గ్రామం నుంచి కృష్ణంరాజు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, సహా ఎంతో నటీనటులు వెండితెరకు పరిచయమై ఇలవేల్పులుగా మారారు. హీరోలను ఇక్కడి అభిమానులు గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. అంత క్రేజ్ అక్కడికి వెళితే ఉంటుంది.
ఇక ఇప్పటికే మొగల్తూరుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు పలుసార్లు వచ్చారు. చిరంజీవి పర్యటనలకు కూడా అభిమానులు పోటెత్తారు. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా భీమవరం నియోజకవర్గంలో పోటీ కూడా చేశారు. మొగల్తూరును సందర్శించారు. చిరు, పవన్ ల కోసం జనాలు ఎగబడ్డారు.. ఆదరించారు.
Also Read: Prabhas- YCP MLA: ప్రభాస్ తో వైసీపీ ఎమ్మెల్యే కీలక భేటీ – ఇదిగో ఆధారాలు
అయితే తాజాగా తన పెదనాన్న కృష్ణంరాజు స్వగ్రామం అయిన మొగల్తూరుకు ప్రభాస్ రాగానే అభిమానులు పోటెత్తారు. వీరి స్వగ్రామంలో కృష్ణంరాజు సంస్మరణ సభను ప్రభాస్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏకంగా 70వేల మంది ప్రజలకు విందు భోజనం ఏర్పాటు చేయించారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ ను చూడడానికి గోదావరి జిల్లాల నుంచి అభిమానులు పోటెత్తారు. ఆ విందులో పాలుపంచుకున్నారు. ప్రభాస్ ఇలా సొంత గ్రామాన్ని గుర్తు పెట్టుకొని వచ్చి మరీ అభిమానులను కలుసుకొని విందు ఏర్పాటు చేయడాన్ని చూసి వారంతా ఫిదా అయ్యారు.
అందుకే ‘ఇప్పటివరకూ చిరంజీవి రావడం చూశారు.. పవన్ కల్యాన్ రావడం చూశారు కానీ.. 12 ఏళ్ల తర్వాత ఒక రాజు (ప్రభాస్) వస్తే ఇలా ఉంటుంది’ అంటూ పోస్టర్లు వేసి మరీ మొగల్తూరులో ప్రభాస్ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. ప్రభాస్ కు అభిమానులపై ప్రేమ ఎంతుందో అంతకుమించిన అభిమానాన్ని వాళ్లు మొగల్తూరులో చూపిస్తున్నారు. ఇప్పుడు మొగల్తూరు మొత్తం ప్రభాస్ నామస్మరణతో మారుమోగిపోతోంది.