spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Lokesh public stunt ministers MLAs performance: మంత్రులకు ఎమ్మెల్యేలకు బంపర్ మార్కులు.. పీఆర్ స్టంట్...

Lokesh public stunt ministers MLAs performance: మంత్రులకు ఎమ్మెల్యేలకు బంపర్ మార్కులు.. పీఆర్ స్టంట్ కాదు.. ఇది నిజంగా లోకేష్ మార్క్ పబ్లిక్ స్టంట్.. పాపం వైసిపి..

Lokesh public stunt ministers MLAs performance: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామని వైసిపి గొప్పగా చెప్పుకుంది. తన అనుకూల మీడియాలో గొప్పగా రాసుకుంది. ఓ పాఠశాల విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠాలను బట్టి పట్టించి.. జగన్ ముందు వల్లె వేయించింది. ఆ విద్యార్థులు మాట్లాడే తీరు.. వ్యవహరిస్తున్న తీరు ఒక రకంగా పిఆర్ స్టంట్ లాగా అనిపించింది. నిజానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడడం మంచిదే. కాకపోతే ఏదో మొక్కుబడి వ్యవహారం లాగా దానిని మార్చడమే అసలైన ఇబ్బంది. వైసిపి దానిని చేసింది. దాని వెనుక ఉన్న అసలు కోణాన్ని నాడు టిడిపి బయట పెట్టింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో విద్యా వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టేందుకు లోకేష్ ప్రణాళికలు రూపొందించారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేసేలా ప్రణాళికలు రూపొందించారు. మెరుగైన ఫలితాలు సాధ్యం కావాలని వారికి పదే పదే చెప్పేవారు. అలాగని బండెడు చాకిరి చేయాలని అనేవారు కాదు. అందువల్లే ఏపీలో ఈసారి పది ఫలితాలు రికార్డు స్థాయిలో వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అంతకుమించి అనే స్థాయిలో మార్కులు సాధించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులకు నిదర్శనంగా నిలిచారు.

ఆమధ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాక్ అసెంబ్లీ నిర్వహించింది. కొంతమంది విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసింది అందులో కొంతమంది విద్యార్థులు ఎమ్మెల్యేలుగా.. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులుగా.. ముఖ్యమంత్రిగా.. మంత్రులుగా వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో స్పీకర్ పాత్రలో నటించిన స్వాతి ఇటీవల టెన్త్ ఫలితాలలో టాప్ ర్యాంక్ సాధించింది. ఆమె ఏకంగా 594 మార్కులు పొందింది. ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వీర ఉదయశ్రీ 592 మార్కులు సాధించింది. ప్రతిపక్షపాత్రలో నటించిన సౌమ్య 571 మార్కులు పొందింది. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వ్యవహరించినవారు 580 కి పైగా మార్కులు సాధించారు.

ఇదంతా కూడా నారా లోకేష్ ముందు చూపుకు నిదర్శనం. ఎందుకంటే పాఠశాలలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుంది. పాఠశాలలలోనే విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీనిని పూర్తిగా నమ్మిన లోకేష్.. అద్భుతమైన ప్రణాళికలు రూపొందించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. అందువల్లే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు 10 ఫలితాలలో అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఇటువంటి పనులు వైసిపికి చేతకావు. ఆ పార్టీ చేయలేదు కూడా..

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper
Exit mobile version