Manickavel Arunachalam
Manickavel Arunachalam: అంబానీల వ్యాపారం నేడు లక్షల కోట్లకు చేరి ఉండవచ్చు గాక.. ప్రపంచ దేశాలలో కార్యకలాపాలు సాగిస్తూ ఉండవచ్చు గాక.. కానీ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఈ స్థాయికి రావడానికి వారి తండ్రి ధీరుబాయ్ అంబానీ విపరీతంగా కష్టపడ్డారు. పెట్రోల్ బంకులో పనిచేశారు. ఆ తర్వాతే రిలయన్స్ సామ్రాజ్యాన్ని ఇంతలా విస్తరించారు.
Also Read: ట్రిపుల్ ఎక్స్ సబ్బుల కంపెనీ యజమాని ఇకలేరు..
ప్రతి వ్యాపార వెనుక కష్టమైన కథ ఉంటుంది. ఆ కష్టాన్ని విజయవంతంగా అనుభవిస్తేనే వృద్ది అనేది సాగుతుంది. ఇప్పుడు ఇదే వృత్తాంతం XXX డిటర్జెంట్ బ్రాండ్ కు కూడా వర్తిస్తుంది. XXX అధినేత మాణిక్క వేల్ నిన్న గుంటూరులో చనిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా దేశంలోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందారు. అయినప్పటికీ ఉపయోగలేకపోవడంతో ఆయనను ఇంటి వద్దే ఉంచారు. గుంటూరులోని అరండల్ పేట లో గురువారం ఆయన లోకం విడిచి వెళ్లిపోయారు. చిన్నప్పుడే తన కుటుంబ సభ్యులతో గుంటూరు వచ్చిన మాణిక్కవేల్.. గుంటూరులోనే చదువుకున్నారు.(తమిళనాడు రాష్ట్రంలోని ట్యూటో కొరియన్ ఈయన సొంత ప్రాంతం అని చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో గొడవపడి ఇక్కడికి వచ్చారని అంటుంటారు) ఇక్కడ ఏది గారు ఎంతో కష్టపడి సబ్బుల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అయితే మార్కెట్లో అప్పటికే హిందుస్థాన్ కంపెనీ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తన బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నది. ఈ క్రమంలో సబ్బుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన మాణిక్క వేల్.. నెమ్మది నెమ్మదిగా విస్తరించడం మొదలుపెట్టారు. అయితే ఆయన పడిన కష్టానికి కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తింపు లభించింది. దానికంటే ముందు మాత్రం ఆయన తీవ్ర ఇబ్బంది పడ్డారు.
XXX బ్రాండ్ కోసం..
XXX బ్రాండ్ ను ప్రజలకు చేరువ చేయడానికి ఆయన “సంస్కారవంతమైన సోప్” అనే పదాన్ని వాడారు. అది జనాలకు బాగా నచ్చింది. ఆ పదం జనాల్లోకి వెళ్లడానికి మాణిక్కవేల్ ఎంతో ప్రయత్నించారు. ఆరోజుల్లో 250 రూపాయలతో ఐదు కేసుల డిటర్జెంట్లను మాణిక్క వేల్ తయారు చేశారు. వాటిని ఇంటింటికీ తిరిగి విక్రయించారు. జనాలకు నమ్మకం కుదరడానికి ఇళ్లల్లో మాసిన దుస్తులను స్వయంగా ఆయనే ఉతికేవారు. అవన్నీ శుభ్రమైన తర్వాత స్వయంగా చూపించేవారు. దీంతో మహిళలు ఆ సబ్బు మీద నమ్మకాన్ని పెంచుకొని కొనుగోలు చేసేవారు. గుంటూరులో ఆయన చేసిన ప్రయోగం విజయవంతమైన తర్వాత.. నెమ్మది నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు విస్తరించడం మొదలుపెట్టారు.. వాస్తవానికి మాణిక్క వేల్ ఒకసారి తమిళనాడులోని అరుణాచలం వెళ్లారు.. అక్కడ ఒక బార్ లో XXX బ్రాండ్ తో ఉన్న రమ్ ను చూశారు. నా పేరు యూనిక్ గా ఉండడం, సులభంగా జనాలకు రీచ్ అవుతుందని భావించడంతో..ఆ పేరు పెట్టారట.. ఆ తర్వాత XXX బ్రాండ్ ను జనాల్లోకి తీసుకెళ్లారు.. ఓ అంచనా ప్రకారం XXX బ్రాండ్ విలువ నేడు వందల కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. XXX బ్రాండ్ విజయవంతమైన తర్వాత మాణిక్క వేల్ అనుబంధ వ్యాపారాలను కూడా ప్రారంభించారు. వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జీవితం అద్భుతమైన స్థితిలోకి చేరుకుంటున్న తరుణంలో ఆయన ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడం.. ఎన్ని ఆస్పత్రులు చూపించినా నయం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కొద్దిరోజుల నుంచి ఆయనను ఇంటి వద్ద ఉంచుతున్నారు. ఆరోగ్యం విషమించి గురువారం మాణిక్క వేల్ కన్నుమూశారు.