https://oktelugu.com/

Kerala :  భర్తపై ప్రేమతో ఈమె చేసిన ప్రయత్నానికి కోర్టు కూడా సలాం

మహిళ అభ్యర్థనపై జస్టిస్ విజి అరుణతో కూడిన ధర్మాసనం పరిశీలించి సానుకూల తీర్పును ఇచ్చింది. భర్త నుంచి వీర్యం సేకరించి భద్ర పరచాలని వైద్యులకు సూచించారు. భర్త నుంచి వీర్యం సేకరణ తప్ప మిగతావి ఏదీ చేయకూడదని హెచ్చరించింది. అయితే దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 22, 2024 11:04 am
    Kerala High Court

    Kerala High Court

    Follow us on

    Kerala :  మానవ సంబంధాల విషయంలో ఒక్కోసారి కోర్టులు సంచలన తీర్పును ఇస్తుంటాయి. తాజాగా కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. ఓ మహిళ తన సంతానం కోసం చేసిన అభ్యర్థనను స్వీకరించిన హైకోర్టు.. ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. పెళ్లయిన తరువాత చాలా మంది మహిళలై ఐదోతనం కోసం ఎదురుచూస్తుంటారు. కానీ కొన్ని పరిస్థితుల్లో సంతానం పొందే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతం సంతానం పొందేందుకు వివిధ మార్గాలు ఉన్నా.. భర్త సాయంతోనే తను పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంది. దీంతో తన పరిస్థితి గురించి కోర్టుకు వివరించగా.. అందుకు అనుకూలంగా తీర్చునివ్వడం సంచలనగా మారింది. ఇంతకీ మహిళ కోర్టును ఏమని కోరింది? కేరళ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? ఆ వివరాల్లోకి వెళితే..

    కేరళకు చెందిన ఓ మహిళ సంతానం కావాలని కోరుకుంటోంది. అయితే పెళ్లయిన తరువాత తన భర్త అనారోగ్యాన బారిన పడ్డారు. ఎన్నో రోజులు ఆసుప్రతిలో ఉన్న జబ్బు నయం కాలేదు. పరిస్థితి తీవ్రం కావడంతో ఆయన చావు బతులకు మధ్య కొట్టు మిట్టాడుతోంది. అయితే తన భర్త ద్వారా సంతానం కావాలని ఆశపడిన మహిళకు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో ఎలాగైనా తన భర్త సాయంతోనే పిల్లల్ని కనాలని అనుకుంది. ఇందు కోసం భర్త వీర్య కణాలను భద్ర పరచాలని అనుకుంది. అయితే వీర్యకణాలు భద్ర పరచాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో ఆ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

    ఈ పిటిషన్ పై బుధవారం స్వీకరించి విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా ఆ మహిళ మాట్లాడుతూ తనకు పెళ్లయి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సంతానం కలగలేదని తెలిపింది. అయతే తన భర్త వీర్య కణాల ద్వారా సంతానం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. అయితే తన భర్త సమ్మతి తెలియజేయడానికి తనను కోర్టుకు తీసుకురాలేదని తెలిపింది. ప్రస్తుతం తన భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడని, అందువల్ల రాత పూర్వక సమ్మతి తెలియజేయలేనని తెలిపింది.

    మహిళ అభ్యర్థనపై జస్టిస్ విజి అరుణతో కూడిన ధర్మాసనం పరిశీలించి సానుకూల తీర్పును ఇచ్చింది. భర్త నుంచి వీర్యం సేకరించి భద్ర పరచాలని వైద్యులకు సూచించారు. భర్త నుంచి వీర్యం సేకరణ తప్ప మిగతావి ఏదీ చేయకూడదని హెచ్చరించింది. అయితే దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేశారు. ప్రస్తుత కాలంలో భర్త ఉండగానే వేరొకరితో సంబంధాలు ఏర్పరుచుకొని పిల్లల్ని కంటున్నారు. కానీ ఈ మహిళ తన భర్త సాయం ద్వారా సంతానం కోరుకోవడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

    పెళ్లయిన తరువాత చాలా మంది సంతానం కోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేసినా కొందరికి ఐదోతనం కలిసి రాదు. అయితే ప్రస్తుతం కాలంలో కొందరు పిల్లల్ని వద్దనుకుంటున్నారు. మరికొందరు సరోగసి తదితర మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తన భర్తపై ఉన్న ప్రేమతో ఈమె చేసిన ప్రయత్నాన్ని కొందరు మెచ్చుకుంటున్నారు. అయితే సెప్టెంబర్ 9న మరోసారి దీనిపై విచారణ ఉన్నందున ఆరోజు ఎలాంటి తీర్పు వస్తుందోనని అనుకుంటున్నారు.