https://oktelugu.com/

Vijay: హీరో విజయ్ పార్టీ జెండా.. అజెండా ఇదీ.. ఇక సినిమాలు బంద్.. ఇక ఫుల్ టైమ్ పొలిటీషియన్…

రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీలో మాస్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో విజయ్ లాంటి ఒక యంగ్ హీరో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. తన డాన్స్, డైలాగ్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అలాగే రజనీకాంత్ తర్వాత మాస్ లో మంచి గుర్తింపును పొందిన ఏకైక హీరో కూడా విజయ్ గారే కావడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : August 22, 2024 / 11:08 AM IST

    Vijay

    Follow us on

    Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కమలహాసన్ తర్వాత అంతటి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్… తమిళనాడు చాలా సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన ఈయన ఇప్పుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ‘గోట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే ఆయన ఇళయ దళపతిగా తనకంటూ ఒక భారీ క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల గుండెల్లో చెరగని అభిమానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అలాంటి విజయ్ సినిమాలకి పుల్ స్టాప్ పెట్టి రాజకీయంగా ఒక కొత్త శకాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక గతంలో ఆయన ‘తమిళగ వేట్రి కలగం’ అనే ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించాడు. ఇక రీసెంట్ గా ఆ పార్టీ కి సంబంధించిన జెండాని కూడా ఆయన ఆవిష్కరించారు. ఇక ఆ తర్వాత తన పార్టీ అంథామ్ ని కూడా రిలీజ్ చేశారు. కుల, మత,ప్రాంత, లింగ బేధాలు లేకుండా తమ పార్టీ అందరికీ మేలు చేస్తుందని చెప్పాడు. అలాగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు…ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనియను చూపించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర వహించాడు.

    మరి విజయ్ కూడా తమిళనాడు రాజకీయాల్లో కీలకపాత్ర వహించబోతున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలన్నింటినీ కంప్లీట్ చేసి 2026వ సంవత్సరానికల్లా పూర్తి గా పొలిటీషియన్ గా మారిపోవాలనే ఎజెండాతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు సినిమాలు చేస్తున్నప్పటికీ ఇటు రాజకీయంగా కూడా ఆయన చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇప్పటికే తన పార్టీని బలోపేతం చేయడానికి కొంతమంది నాయకులను తమ పార్టీలో చేర్చుకునే క్రమంలో ముందడుగులు వేస్తున్నాడు. ఇక విజయ్ రాకతో తమిళనాడు రాజకీయాల్లో కొంతవరకు కలవరమైతే రేగుతుందనే చెప్పాలి. ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీకి కూడా విజయ్ పార్టీ పెట్టడంతో కొంతవరకు డ్యామేజ్ జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు.

    సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం రాజకీయాల ద్వారా వాళ్ళకు సేవ చేయాలని ముందుకు సాగుతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే రాజకీయంగా సక్సెస్ అవుతాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే…