KCR Etela Rajendar: వాళ్లిద్దరూ ఒకప్పుడు ప్రాణమిత్రులు.. ఇప్పుడు బద్ద శత్రువులు.. ఉద్యమంలో కలిసి నడిచిన వాళ్లు ఇప్పుడు కలహించుకుంటున్నారు. ఏకంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నారు. ఈ పోరులో సహచరుడే గెలిచాడు.. అధినేత ఓడిపోయారు. పంతం పట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ నే ఓడించి గెలిచారు ఈటల రాజేందర్.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ టీఆర్ఎస్ అధినేతగా ముందుండి నడిపిస్తే పార్టీలో నంబర్ 2గా ఈటల నిలిచారు. కేసీఆర్ ఢిల్లీలో రాజకీయం చేస్తే.. తెలంగాణ గల్లీలో ఈటల రాజేందర్ నడిపించేవారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఈటల రాజేందర్ రాష్ట్రం విడిపోయేదాకా కొనసాగారు. తెలంగాణ తొలి మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఈటల చేశారు. ఏకంగా కీలకమైన ఆర్థిక, పౌరసరఫరాల శాఖను చూశారు.కానీ రెండో దఫా అధికారంలోకి వచ్చాక ఈటలను దూరం పెట్టి అవినీతి ఆరోపణలతో బర్త్ రఫ్ చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి టీఆర్ఎస్ ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు.
బీజేపీపై ఇప్పుడు కేసీఆర్ ఇంతగా రెచ్చిపోవడానికి.. కేంద్రంలోని మోడీ సర్కార్ పై ఒంటికాలితో లేవడానికి ప్రధాన కారణం ఈటల రాజేందర్ యే. ఎందుకంటే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. అప్పటివరకూ అసలు బీజేపీని లెక్కలోకి తీసుకోలేదు. ఒకప్పటి కేసీఆర్ అనుంగుడు.. టీఆర్ఎస్ లో నంబర్ 2గా ఉన్న ఈటలను ఓడించడానికి కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. అయినా కూడా ఈటల భారీ విజయం సాధించడంతో కేసీఆర్ ఈక్వేషన్లు మారిపోయారు. ఇప్పుడు బీజేపీని తెలంగాణలో లేకుండా చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దీనికి కారణం ఈటల రాజేందర్ యే..
ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ ఈటల ముఖం చూడవద్దని ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ సస్పెండ్ చేయించారు. ఇంత వ్యతిరేకిస్తున్న ఈటలకు సర్ ప్రైజ్ ఇచ్చాడు కేసీఆర్. పగబడితే అవతలవాడి అంతుచూసేదాకా వదలని కేసీఆర్ తాజాగా ఈటలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం వైరల్ గా మారింది.
‘మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video: