Telangana Elections 2023: గేర్‌ మార్చిన కేసీఆర్‌.. చివరి నిమిషంలో కొత్త అస్త్రాలు వెలికితీత.. గెలుపుతీరం చేర్చేనా?

తెలంగాణ ఎన్నికల సంగ్రామం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

Written By: Raj Shekar, Updated On : November 26, 2023 1:39 pm

KCR

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుంది. మూడు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ హైదరాబాద్‌లోనే మకాం వేశారు. ఇక ఎన్నికల యుద్ధం కాంగ్రెస్‌ వర్సస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగా కొనసాగుతోంది. ఈ సమయంలో సీఎం కేసీఆర్‌ గేర్‌ మార్చుతున్నారు. చివరి రెండు రోజుల్లో కొత్త అస్త్రాల వెలికి తీస్తున్నారు. కేసీఆర్‌ నిర్ణయాలు కలిసి వస్తాయా..హ్యాట్రిక్‌ విజయం తెచ్చిపెడతాయా అన్న చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌..
తెలంగాణ ఎన్నికల సంగ్రామం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 80 సీట్లు సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ అయితే 80కి ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని సవాల్‌ చేశారు. మరోవైపు విజయం తమదేనని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకత్వం చెబుతోంది. కానీ, లోలోపల భయం మొదలైంది. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ సమయంలో ప్రచారానికి ఒకరోజు విశ్రాంతి ఇచ్చిన గులాబీ బాస్‌.. కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశాల పైన కేసీఆర్‌ కీలక సమీక్ష చేశారు. ప్రచారం తుది దశకు చేరటంతో నియోజవర్గాల వారీగా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. సర్వే నివేదికలను సమీక్షించారు. ఎక్కడ కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. ఏ అంశాలు ప్రభావితం చూపుతున్నాయనే అంశాలను గుర్తించారు. దీంతో ప్రచారం, హామీల గేర్‌ మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ రెండు రోజుల ప్రచార సభల్లో కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ కొత్త ప్లాన్‌..
కాంగ్రెస్‌ ప్రధానంగా సీఎం కేసీఆర్‌ వైఖరి… అమలు కాని హామీలు.. మహిళలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. నిరుద్యోగ యువతపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేసింది. యువత బీఆర్‌ఎస్‌కు దూరం అవుతున్నట్లు కేసీఆర్‌ తన సమీక్షలో గుర్తించారు. అదే ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతోంది. అదే సమయంలో మహిళల మద్దతు ఎవరికి ఉందనేది కేసీఆర్‌ ప్రత్యేకంగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం..
ప్రతీ నియోజకవర్గంలో గ్రౌండ్‌ రియాల్టీని సమీక్షించిన కేసీఆర్‌.. పార్టీ శ్రేణులకు కీలక దిశా నిర్దేశం చేశారు. మరో రెండు మూడు కొత్త పథకాలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొత్త హామీలు ఇస్తే జనం ఆలోచన కచ్చితంగా మారుతుందని భావిస్తున్నారు. మూడు రోజుల ప్రచారంలో కేసీఆర్‌ వీటినే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

కీలక ప్రకటనలు..
ఈ ఎన్నికల్లో మహిళలు, యువతే కీలకంగా మారనున్నారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది వీరే అని తేలిపోయింది. దీంతో కేసీఆర్‌ యువతను ఆకట్టుకోవటంతోపాటుగా.. మహిళా ఓట్‌ బ్యాంక్‌.. గ్రామీణ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకన్నట్లు తెలుస్తోంది. అయితే.. కేసీఆర్‌ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు.. నిమిషంలో చేసే ఈ ప్రకటనలు ఓటర్లపై ఏమేరకు ప్రభావం చూపుతాయని అన్న చర్చ కూడా జరుగుతోంది.