https://oktelugu.com/

KCR vs Revanth Reddy: కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం

KCR vs Revanth Reddy: తెలంగాణలో రాజకీయం మారిపోతోంది. రోజురోజుకు పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో రేపు ఏం జరుగుతుందో అనే అనుమానమే అందరిలో వస్తోంది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు పోటీ తామేనని కాంగ్రెస్ భావించినా ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాష్ర్టంలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. రాష్ర్టంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పేందుకు వ్యూహాలు ఖరారు చేస్తున్నారు.   […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 25, 2021 / 11:06 AM IST
    Follow us on

    KCR vs Revanth Reddy: తెలంగాణలో రాజకీయం మారిపోతోంది. రోజురోజుకు పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో రేపు ఏం జరుగుతుందో అనే అనుమానమే అందరిలో వస్తోంది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు పోటీ తామేనని కాంగ్రెస్ భావించినా ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాష్ర్టంలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. రాష్ర్టంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పేందుకు వ్యూహాలు ఖరారు చేస్తున్నారు.

    KCR vs Revanth Reddy

     

    ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాచికలు వేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలను ఒకే వేదిక మీద ఎండగట్టి తమ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఈ సారి ఎర్రబెల్లిని ఎంచుకున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమైన ఎర్రబెల్లిలోనే ఆందోళన నిర్వహించి వారి అక్రమాలను బట్టబయలు చేస్తామని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి వ్యూహంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

    Also Read: 2021 Roundup: 2021 రౌండప్.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం

    ఇంతకీ రేవంత్ రెడ్డి టార్గెట్ టీఆర్ఎస్ నా బీజేపీనా అనే సంశయం అందరిలో వస్తోంది. ఆ రెండు ఒక తాను ముక్కలే అని చెప్పేందుకే రేవంత్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ ను ఒక్కసారిగా పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన ఎర్రబెల్లిలో కాంగ్రెస్ శ్రేణులతో ఆందోళన నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

    హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రాష్ర్టంలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో దిద్దుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ లో జోష్ నింపి మళ్లీ ఆశలు చిగురించేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న ప్రాంతాన్ని టార్గెట్ చేసి అక్కడ వారి బాగోతాన్న బట్టబయలు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా రేవంత్ రెడ్డి ఆలోచనలకు కార్యరూపం వస్తుందా? కాంగ్రెస్ లో పూర్వ వైభవం తెస్తుందా? అనే అనుమానాలు కాంగ్రెస్ నేతలను వెంటాడుతున్నాయి.

    Also Read: CM KCR: ‘ముందస్తు’కు వెళ్లితే కేసీఆర్ తన గొయ్యి తాను తవ్వుకున్నట్టేనా?