CM KCR Vijayawada Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో కూటమి ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీని కోసం అన్ని కోణాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. విజయవాడలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఆయన చివరగా 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ఏపీ సీఎం జగర్ ను ఆహ్వానించేందుకు వెళ్లి బెజవాడ కనకదుర్గను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మళ్లీ ఇప్పుడు సీపీఐ సభల కోసం విజయవాడకు వెళ్లనున్నారు. మూడేళ్ల తరువాత సీఎం కేసీఆర్ మరోమారు విజయవాడలో అడుగుపెట్టనున్నారు.

ఇన్నాళ్లు కమ్యూనిస్టులను తోక పార్టీలుగా అభివర్ణించిన కేసీఆర్ కు ఇప్పుడు ఆ పార్టీలే ఆపదలో ఆదుకునేవిగా కనిపిస్తున్నాయి. కానీ వాటి ప్రభావం లేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘ కాలం అధికారం చెలాయించిన కమ్యూనిస్టుల కంచుకోట కాస్త పడిపోయింది. కేరళలో కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో వాటిని నమ్ముకుని కేసీఆర్ గట్టెక్కాలని చూడటం అత్యాశే అవుతుంది. మొత్తానికి కమ్యూనిస్టులను నమ్ముకుని కేసీఆర్ బీజేపీని ఎదుర్కోవాలని చూడటమే అవుతుందనడంలో సందేహం లేదు.
ఈ సమావేశాలకు కేరళ, బిహార్ ముఖ్యమంత్రులు పినరయ్ విజయన్, నితీష్ కుమార్ హాజరవుతున్నారు. దీనికి 20 దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఫార్వర్డ్ బ్లాక్ నేతలు రానున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయవాడ నుంచే మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కుదిరిన పరస్పర అంగీకారంతో కమ్యూనిస్టు పార్టీలను కూడా కలుపుని వెళ్లేందుకు కేసీఆర్ నిర్ణయించారు ఇందులో భాగంగానే మునుగోడులో కమ్యూనిస్టుల కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టడం ఇది రెండోసారి. దీంతో కేసీఆర్ ఏపీ పర్యటనతో అక్కడ రాజకీయ పరిణామాలు మారనున్నాయా? అనే ఆలోచన అందరిలో వస్తోంది. కానీ కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాల్లో భాగంగానే కేసీఆర్ వివిధ రాష్ర్టాలు తిరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు, కేరళ, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తిరిగిన కేసీఆర్ బీజేపీయేతర శక్తుల ఏకీకరణకు నడుం కడుతున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:Bonthu Rajeswara Rao: జనసేన పార్టీలోకి వైఎస్ సన్నిహితుడు.. వైసీపీకి రాజీనామా..
[…] […]