కథ అనేది ఎంత కొత్తగా ఉంటే.. ఆ సినిమా అంత గొప్ప విజయతీరాలకు చేరుకుంటుందని.. ఇండస్ట్రీలోని అఫీస్ బాయ్ కి కూడా తెలుసు. కానీ, కథకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం అని మాటలు చెప్పుకుని.. తమను తాము మోసం చేసుకునే దర్సక నిర్మాతలు హీరోలే ఎక్కువమంది ఉంటారు, అయితే గత నాలుగైదు సంవత్సరాలుగా తెలుగు సినిమా కథకు కాలం కలిసొచ్చింది. స్టార్ ఎంత బడా స్టార్ అయినా, డైరెక్టర్ ఎంత క్రియేటివిటి ఉన్నవాడు అయినా, కథ బాగుంటేనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మొత్తానికి కథకు అగ్రతాంబూలాన్ని ఇస్తున్నారు.
వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?
అందుకే ప్రతి హీరో స్వయంగా కథలు గురించి ఆరా తీస్తున్నారు. ప్రత్యేకంగా తనకంటూ కథలను తీసుకురావడానికి ఒక టీంను పెట్టుకుంటున్నారు, బన్నీ దగ్గర నుండి మహేష్ వరకూ అందరూ మంచి కథల కోసం ఎదురుచూస్తున్నారు. పైగా కరోనాతో కావాల్సినంత ఖాళీ టైమ్ దొరికింది అందరికీ. ఈ సమయాన్ని చక్కగా కథల కోసం సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారంతా. గత కొన్ని నెలలుగా తీరిక లేక కొత్త కథలు వినలేకపోయిన హీరోలందరూ ఈ తీరిక సమయాన్ని సాంకేతిక ద్వారా డైరెక్టర్స్ అండ్ రైటర్స్ దగ్గర నుండి కథలు వినడానికి తమ సమయాన్ని కేటాయిస్తున్నారు.
తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?
పైగా తమకు ఎలాంటి కథలు కావాలో రచయితలకు, సన్నిహితులైన దర్శకులకు వివరంగా చెప్పి మరీ వారి చేత కథలు రాయించుకుంటున్నారు హీరోలు. దర్శకులు సైతం హీరోలు ఖాళీగా ఉండటంతో తమ వద్ద ఉన్న కథలను వారి ముందుంచుతూ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే పనిలో పడ్డారు. మొత్తానికి కరోనా ప్రవాహంలో కూడా టాలీవుడ్ లో మాత్రం కథలు కొత్త కాంబినేషన్లు అంటూ హడావుడిగానే ఉంది.