Telangana: తెలంగాణ ప్రభుత్వం రైతులను మచ్చిక చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుబంధు, రైతు బీమీ వంటి పథకాలు ప్రారంభించింది. ఇంకా వారిని తమ వైపు తిప్పుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి తరువాత పార్టీలో అంతర్మథనం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంటుందనే భయం నెలకొంది. అందుకే ఓటర్లను ప్రభావితం చేసే పథకాల కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే రైతులకు పింఛన్ పథకాన్ని రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.

Also Read: ఎరువుల ధరల పెంపుః కేసీఆర్ కు మరో అస్త్రం దొరికిందిగా.. కేంద్రంపై విమర్శల బాణాలు..
ఇప్పటికే రైతుబంధు కోసం ప్రతి రైతుకు ఎకరానికి రూ. పదివేలు ఇష్తున్నారు. దీంతో ఇప్పుడు రైతు పింఛన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని భావిస్తున్నారు. దీనికి గాను ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు. అన్నదాతలను ఆదుకునే ఉద్దేశంతోనే వారికి పింఛన్ ఇవ్వాలని భావిస్తున్నా అసలు ఉద్దేశం అది కాదనే వాదన కూడా వినిపిస్తోంది.
దీంతో బీజేపీని గద్దె దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. రైతులకు పింఛన్ ఇస్తే ఎంత మేర ఖర్చవుతుంది? ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు? తదితర విషయాలపై నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. అన్నదాతలను తమ వైపు తిప్పుకునేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయంపై కూడా దృష్టి సారించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రైతుబంధు పథకంలో 67 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 47 ఏళ్లు నిండిన వారు ఎంత మంది? 49 ఏళ్లు నిండిన వారు ఎంత మంది ఉన్నారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. రైతు పింఛన్ పథకానికి 47 నిండిన వారు అర్హులుగా తేల్చనున్నారు. వీరికి నెలకు రూ. 2016 ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: టార్గెట్ బీజేపీ.. సీఎం కేసీఆర్‌తో తేజస్వి యాదవ్ కీలక భేటీ.. జాతీయ రాజకీయాలపై ఫోకస్