తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు..

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారడంతో ప్రభుత్వం రద్దుకే మొగ్గు చూపింది. తెలంగాణ హైకోర్టు హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలో పదో తరగతి పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసింది. అందరికీ ఒకేసారి కాకుండా వేర్వుగా పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం విద్యాశాఖ అధికారులు […]

Written By: Neelambaram, Updated On : June 8, 2020 7:17 pm
Follow us on


పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారడంతో ప్రభుత్వం రద్దుకే మొగ్గు చూపింది. తెలంగాణ హైకోర్టు హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలో పదో తరగతి పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసింది. అందరికీ ఒకేసారి కాకుండా వేర్వుగా పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈమేరకు నేడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఆధర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత తరుణంలో పదోతరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్వహించిన ప్రీఫైనల్, అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడులను ఖారారు చేయనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు అన్ని పాఠశాలల నుంచి గతంలో నిర్వహించిన ప్రీపైనల్ ఎగ్జామ్ రిజర్ట్ లను తెప్పించుకొని పదోతరగతి విద్యార్థులకు గ్రేడింగ్ తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,34,903మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్షలను పూర్తి చేశాయి. మెయిన్ సబ్జెక్టులు విద్యార్థులు రాయాల్సి ఉండగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసింది. ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాటు చేసింది. పదో తరగతి విద్యార్థులకు ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లు ఉన్నారు. వీటిలో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. నేడు ఈ పరీక్షల నిర్వహాణపై చర్చించి ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేనందున పరీక్షలు రద్దుచేసి విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణపై భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.