దళితబంధు పథకం అమలు చేయాలని విపక్షాలు, దళిత సంఘాలు కూడా గట్టిగా చెప్పడంతో ప్రభుత్వం ఈనెల 16 నుంచి పథకం ప్రారంభానికి కసరత్తు చేస్తోంది. మొదటి విడతగా ఐదు వేల మందికి పది లక్షల చొప్పున పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఊపందుకోనుందని చెబుతున్నారు. నగదు బదిలీ ప్రారంభమైన తరువాత పాజిటివ్ కంటే నెగెటివ్ లే ఎక్కువగా వచ్చే సూచనలున్నట్లు కనిపిస్తోంది.
కొంతమందికి ఇప్పుడు ఇచ్చి ఎన్నికల తరువాత ఇస్తామని చెబితే ప్రజలు నమ్మకం కోల్పోయి ఆగ్రహానికి గురవుతారని సమాచారం. దీంతో ప్రభుత్వం దళితబంధు పథకం అమలుపై సందేహాలు వస్తున్నాయి. హుజురాబాద్ లో పంపిణీ చేస్తే సరిపోతుందా అన్ని నియోజకవర్గాల్లో అమలు జరిగేలా ప్రయత్నాలు ప్రారంభించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దళిత బంధు ప్రభుత్వానికి ప్రతిబంధకమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
దళితబంధు పథకం గురించి ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ర్ట అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దళిత బంధు పథకం ఓ ఎన్నికల బూటకమని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తూ కేసీఆర్ లాభం పొందాలని చూస్తున్నట్లు విమర్శించారు. ఇదంతా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. దీంతో దళితబంధు పథకం వర్తింపుపై దళితులు నమ్మరని చెప్పారు. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం గురించి అపోహలు పోవాలంటే పథకం అమలు పారదర్శకంగా జరగాలని ఆశిస్తున్నారు.