Komaram Bheem Adivasi Bhavan: దళితుల ఓట్ల కోసం పక్షం రోజులుగా అంబేద్కర్ నామస్మరణ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. కొత్త సెక్రటేరియేట్‌కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టారు. పార్లమెంట్‌కు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా దళితులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. తాజాగా గిరిజన ఓట్లపై గురిపెట్టారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను ఇన్నేళ్లూ పట్టించుకోని గులాబీ బాస్ దృష్టి ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ల.. ఒక్కసారిగా ఆదివాసీలవైపు మళ్లింది. ఆదివాసీలకు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి 10 శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు ముఖ్యమైనవి. వీటిపై జాతీయ సమైక్యతా విజ్రోత్సవాల వేల సెప్టెంబర్ 17న కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదివాసీ భవన్, బంజారా భవన్ ప్రారంభోత్సవం..
హైదరాబాద్ నడిబొడ్డున లంబాడాల కోసం సేవాలాల్ బంజారా భవన్, ఆదివాసీల కోసం కుమ్రురంభీం మంభీమ్ ఆదివాసీ భవన్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.44 కోట్లు ఖర్చు చేసింది. బంజారాహిల్స్‌లోని ఒక ఎకరం స్థలంలో వీటిని నిర్మించారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రెండు భవనాలను శనివారం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని ప్రారంభించనున్నారు.
Also Read: Madhavi: ఆ హీరోయిన్ని మోసం చేశాడు.. ఇప్పుడు అనుభవిస్తున్నాడు !
ప్రతీ భవన్‌కు ఒక ప్రత్యేకత..
హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమురంభీమ్ ఆదివాసీ భవన్‌కు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో భవనంలో వెయ్యి మంది కూర్చొని కార్యక్రమాలు తిలకించేందుకు వీలుగా ఆడిటోరియాలు నిర్మించారు. సభలు, సమావేశాలతోపాటు శుభకార్యాలు నిర్వహించుకునేలా సౌకర్యాలు కల్పించారు. భారత సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. శనివారం రోజునే ఈ రెండు భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అందుకోసం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
గిరిజనులకు శుభవార్త..
బంజారా భవన్, ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గిరిజనులకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. గిరిజన రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల జనాభా ప్రాతిపదికన ఉన్న 6 శాతం రిజర్వేషనే ఎనిమిదేళ్లుగా తెలంగాణలోనూ అమలవుతోంది. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని గిరిజనులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. గిరిజనుల జనాభా పెరిగిందని.. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు కూడా పెంచాలని కోరుతున్నారు. నిజానికి 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల జనాభా 9.34 శాతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వారి జనాభా 9.98 శాతంగా ఉంది. జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లను పెంచకపోవడంతో విద్య, ఉద్యోగాల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడం, ఇప్పటికే గ్రూప్–1 సహా పలు పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో… గిరిజన రిజర్వేషన్ల పెంపు డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు కూడా రిజర్వేషన్లను పెంచకపోతే.. తమకు అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
Also Read: Telangana Politics: తెలంగాణలో రాజకీయం ఎటు వైపు పోతోంది.?
12 శాతం పెంచుతామని కేసీఆర్ హామీ..
గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. పలు సభల్లో కూడా ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలోనే గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఐతే 12 శాతానికి కాకుండా.. 10 శాతం రిజర్వేషన్ల ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.