https://oktelugu.com/

Prabhas- Rajnath Singh: ప్రభాస్ ఫ్యామిలీని పరామర్శించిన రాజ్ నాథ్ సింగ్

Prabhas- Rajnath Singh: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గత ఆదివారం కన్నుమూశారు. తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో నటించి ఆయన ప్రజల హృదయాలను కొల్లగొట్టారు. నటనలో కూడా తనకు ఎదురే లేదని చూపించారు. రెబల్ స్టార్ గా ఇప్పటికీ ఆయన చిత్రాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. రంగూన్ రౌడీ, పులిబెబ్బులి, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం, ధర్మాత్ముడు, ధర్మతేజ, మరణశాసనం వంటి చిత్రాల ద్వారా ఆయనలోని నటనను బయటకు తీశారు. ఎప్పటికప్పుడు తన ముఖంలో […]

Written By: Srinivas, Updated On : September 17, 2022 5:05 pm
Follow us on

Prabhas- Rajnath Singh: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గత ఆదివారం కన్నుమూశారు. తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో నటించి ఆయన ప్రజల హృదయాలను కొల్లగొట్టారు. నటనలో కూడా తనకు ఎదురే లేదని చూపించారు. రెబల్ స్టార్ గా ఇప్పటికీ ఆయన చిత్రాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. రంగూన్ రౌడీ, పులిబెబ్బులి, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం, ధర్మాత్ముడు, ధర్మతేజ, మరణశాసనం వంటి చిత్రాల ద్వారా ఆయనలోని నటనను బయటకు తీశారు. ఎప్పటికప్పుడు తన ముఖంలో రౌద్రం చూపిస్తూ చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. అలా మొగల్తూరు మొనగాడు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు.

Prabhas- Rajnath Singh

Prabhas- Rajnath Singh

ఆయన తన తమ్ముడి కొడుకు ప్రభాస్ ను కూడా స్టార్ హీరోగా చేశారు. అంతేకాదు ప్రభాస్ కొడుకులతో ఆడుకోవాలని కలలు కన్నారు. కానీ అవి నెరవేరలేదు. అంతేకాదు కొడుకు పిల్లలతో సినిమాలు చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నారట. మరోవైపు భక్త కన్నప్పకు సీక్వెల్ తీయాలని కథ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అమరదీపం లో ఆయన నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టారు. కరోనా తదనంతర పరిణామాలతో కృష్ణం రాజు ఆరోగ్యం క్రమంగా దెబ్బతిన్నది. మూత్రపిండాల సమస్యతో బాధపడిన ఆయన చివరకు సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై తెలుగు సినిమా, రాజకీయ నేతలు ఎందరో తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read: Saakini Dhaakini Collections: ‘శాకిని డాకిని’ 1st డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. ఆయన భార్య, కూతుళ్లు, ప్రభాస్ తో మాట్లాడారు. ఆయన మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన పరిస్థితిని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. ఆయనకు సేవలందించిన ఆస్పత్రి కూడా గురించి చెప్పారు. ఆయన అకాల మరణానికి చింతిస్తున్నామని రాజ్ నాథ్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణం రాజు కేంద్ర సహాయ మంత్రిగా కూడా వాజ్ పేయి ప్రభుత్వంలో పనిచేయడం విశేషం.

Prabhas- Rajnath Singh

Prabhas- Rajnath Singh

కృష్ణంరాజుకు వచ్చిన అనారోగ్య సమస్యలపై ఆరా తీశారు. తెలుగు సినిమా పరిశ్రమ ఓ దిగ్గజ హీరోను కోల్పోయిందని గుర్తు చేశారు. ఆయన మృతి తెలుగు ప్రేక్షకులకు, రాజకీయాలకు ఓ పెద్ద దెబ్బగా అభివర్ణించారు. బీజేపీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. మొత్తానికి అటు సినిమా ఇటు రాజకీయ లోకం ఆయన లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారు.

Also Read: September 17 In Telangana: సెప్టెంబర్ 17: తెలంగాణలో నర మేధ గాథ.. రజాకార్ల పాలనలో వెలుగులోకి రాని వాస్తవాలెన్నో?

Tags