https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Faima: బొక్కబోర్లా పడిన గీతూ… రేవంత్‌కి చేసిన అన్యాయం ఫైమాకు తగిలిందిగా

Bigg Boss 6 Telugu Faima: బిగ్ బాస్ లు పగలు ప్రతీకారాలు మొదలయ్యాయి. గత టాస్కుల్లో తమను ఓడించిన.. ప్రభావితం చేసిన వ్యక్తులకు టిట్ ఫర్ టాట్ లాగా బదులిస్తున్నారు కంటెస్టెంట్లు. ముఖ్యంగా ఫైమా, గీతూ రాయల్ తో రేవంత్ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. రేవంత్ తో పెట్టుకొని గీతూ బొక్కబోర్లా పడగా.. రేవంత్ కు మొన్నటి టాస్క్ లో అన్యాయం చేసిన ఫైమాకు కింగ్ ఆఫ్ ది రింగ్ టాస్క్ లో సంచాలకుడిగా ఉన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2022 / 05:42 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Faima: బిగ్ బాస్ లు పగలు ప్రతీకారాలు మొదలయ్యాయి. గత టాస్కుల్లో తమను ఓడించిన.. ప్రభావితం చేసిన వ్యక్తులకు టిట్ ఫర్ టాట్ లాగా బదులిస్తున్నారు కంటెస్టెంట్లు. ముఖ్యంగా ఫైమా, గీతూ రాయల్ తో రేవంత్ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. రేవంత్ తో పెట్టుకొని గీతూ బొక్కబోర్లా పడగా.. రేవంత్ కు మొన్నటి టాస్క్ లో అన్యాయం చేసిన ఫైమాకు కింగ్ ఆఫ్ ది రింగ్ టాస్క్ లో సంచాలకుడిగా ఉన్న రేవంత్ గట్టి షాకిచ్చాడు.

    Faima

    బిగ్ బాస్ లో నిన్నటి దాకా జరిగిన సిసింద్రీ డాల్ టాస్క్ ఆసక్తి రేపింది.. చిన్న పిల్లల బొమ్మలను కంటెస్టెంట్లకు ఇచ్చి వాటిని కాపాడుకోవాలని కంటెస్టెంట్లకు సూచించాడు బిగ్ బాస్. ఈక్రమంలోనే అందరికంటే గీతూ చలాకీగా ఆడింది. కంటెస్టెంట్లు అందరూ నిద్రపోయిన తర్వాత తను మేల్కొండి అందరి డాల్స్ కొట్టేయడానికి ట్రై చేసింది. రేవంత్, శ్రీహాన్, సహా కొందరి డాల్స్ ను తస్కరించి గీతూ వారిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించేసింది.

    Also Read: Brahmastra Collections: బ్రహ్మాస్త్ర 8 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

    ఇక తన బొమ్మను ఎవరైనా కొట్టేస్తారని భయపడిన గీతూ చాలా తెలివిగా ఆలోచించింది. తన బొమ్మల డ్రెస్ ను తీసేసి తెలివిగా ఇంట్లో ఎవరూ వెళ్లలేని ‘స్టోర్ రూంలో’ పెట్టేసింది. అది లాక్ చేసి ఉండడంతో తన బొమ్మ సేఫ్ అనుకుంది. కానీ కూరగాయలు రావడంతో స్టోర్ రూంలోకి వెళ్లిన రేవంత్ అక్కడ ఫ్రిజ్ వెనుకాల దాచిన గీతూ బొమ్మను చూసి దాన్ని ఆమె కంట పడకుండా ఒంటికాలిపై పరిగెత్తుకుంటూ వెళ్లి బయటబుట్టలో పడేశాడు. అలా గీతూను ఎలిమినేట్ చేసేశాడు. తనను ఔట్ చేసిన గీతూకు రేవంత్ తగిన బుద్ది చెప్పాడు. తన బొమ్మను ఎవరూ తాకరు అనుకొన్న గీతూ బొక్కబోర్లా పడింది.

    Faima, revanth

    కింగ్ ఆఫ్ రింగ్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ అందులో ఫైమా, ఆరోహి, కీర్తి, ఇనాయా సుల్తానా పోటీపడ్డారు. ఇందులో మొదట ఫైమా, ఆ తర్వాత ఆరోహి ఎలిమినేట్ అయిపోయారు. ఇక తనను అన్యాయంగా రింగ్ టాస్క్ లోంచి ఎలిమినేట్ చేశాడని ఫైమా ఏడ్చేసింది. రేవంత్ గత టాస్క్ లో తనను కూడా నువ్వు అలానే ఔట్ చేశామని.. ఇప్పుడు నువ్వు కూడా ఔట్ అంటూ స్పష్టం చేశారు. ఇలా రేవంత్ కు అన్యాయం చేసిన ఫైమాకు గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది. రేవంత్ ప్రతీకారం తీర్చుకున్నాడని ఫైమా బోరున ఏడ్చేసింది. ఇలా కంటెస్టెంట్లు తమకు అన్యాయం చేసిన వారిని సందు దొరికితే చాలా వారిపై ప్రతీకారానికి రగిలిపోతూ షోలో అగ్గి రాజేస్తున్నారు. ఈ పోటా పోటీ ఆట ప్రేక్షకులకు వినోదం పంచుతోంది.

    Also Read: Salaar: సలార్ సినిమా పై బిగ్ అప్ డేట్.. రంగంలోకి ప్రభాస్.. వచ్చే వారమే డేట్ ఫిక్స్ !

    Tags