KCR Dalit Bandhu: హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad By-Elections) వేళ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతో హుజురాబాద్ పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకం ప్రారంభించింది. దీంతో రాష్ర్టంలోని అన్నివర్గాల్లో కూడా దీనిపై డిమాండ్ పెరుగుతోంది. తమ ప్రాంతంలో కూడా దళితబంధు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. దీనికి ప్రభుత్వం కూడా సరైన విధంగానే అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు వర్తింపచేస్తామని చెబుతుండడంతో అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి.
మరో వైపు ఇంకా అన్ని కులాలకు విస్తరించాలని చెబుతున్నాయి. బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సైతం ఈ పథకం అందేలా చూడాలని వినతులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరైన విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అధినేత కేసీఆర్ (KCR) చెబుతున్నారు. దీంతో ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాస్త అందరికి అందేలా చూడాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో నేతలు ఏ మేరకు విస్తరిస్తారో తెలియాల్సి ఉంది.
దళితబంధుతోపాటు పేదల బంధు పథకం కూడా తెస్తామని చెబుతుండడంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. తమ బతుకులకు భరోసా వస్తుందని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం సమయం బాగా దూరం చెబుతోంది. వచ్చే మూడు ఏళ్లలో అందరికి విస్తరిస్తామని చెబుతుండడంతో వచ్చే రెండేళ్లలో ఎన్నికల్లో ఈ పథకంతో లబ్ధి పొందాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు సైతం ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఎంత మేర లాభం చేకూరుస్తుందో వేచి చూడాల్సిందే.
ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి వెనక్కి వచ్చిన వారికి కూడా గల్ఫ్ బంధు ప్రకటించాలని కోరుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా వేలల్లో వివిధ ఉపాధి పనుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని ఆదుకోవడానికి గల్ఫ్ బంధు పథకం ప్రారంభించాలని ఒత్తిడి పెరుగుతోంది. వారు త్వరలో హుజురాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం కూడా సరే అనే విధంగా సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం.
దీంతో దళితబంధు పథకం అన్ని వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. రూ.10 లక్షలతో మనకు ఇష్టమైన యంత్రం కొనుగోలుకు ఏ రకమైన షరతులు లేకుండా ఇచ్చేందకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం అవుతోంది. ఉపాధి కరువైన యువత కూడా తమకు నచ్చిన విధంగా వ్యాపారం చేసుకునేందుకు కూడా ఓకే చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దళితబంధు మాదిరి పథకాలు రావాలని ప్రజల్లో ఆశ పెరుగుతోంది.