గ్రేట్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) ఇప్పుడెందుకు విజయవంతమైన సినిమాలు నిర్మించలేక పోతున్నారు ? ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నిజానికి మణిరత్నం గొప్ప దర్శకుడు, పైగా సినిమా లో 24 క్రాఫ్ట్స్ తెలిసిన దర్శకుడు ఒక టెక్నీషియన్ గా అయినా ఆయనకు ఆయనే సాటి.
గ్రేట్ విజువల్ డైరెక్టర్స్ గా రాజమౌళి, శంకర్ లు ఈ మధ్య వచ్చారు. కానీ ముప్పై ఏళ్ల క్రితం ఒక్క మణిరత్నం మాత్రమే ఉన్నాడు. మరి అలాంటి మణిరత్నం ఇప్పుడెందుకు ప్లాప్ అవుతున్నాడు ? ఆయనలో ఒక సమస్య ఉంది. కచ్చితంగా ఆయన మంచి టెక్నీషియనే, కానీ.. తన సినిమాని చాలా ఆర్టిస్టిక్ గా తీస్తాడు.
తన సినిమా కమర్షియల్ గా ఆడుతుందా ? ఆడదా ? అని చెప్పడానికి ఎప్పుడు తనకు ఒకరు కావాలి. 1980లో మణిరత్నం సినిమాలకు ఆయన సోదరుడు GV ఒక క్రిటిక్ పాత్రను బాగా పోషించేవాడు. GV చార్టెడ్ అకౌంటెంట్. సినిమా వ్యాపారంలో GV ఆరితేరిన వాడు. అన్నిటికి మించి కమర్షియల్ అంశాల గురించి బాగా తెలిసిన వాడు.
పైగా GV డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఫైనాన్స్ తీసుకురావడం లాంటివి చేసేవాడు .. దీని వలన మణిరత్నం సినిమాలకు చాలా ప్లస్ అయ్యేది. GV, మణిరత్నం కలిసి పని చేసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. అయితే, ఆ తర్వాత కాలంలో మణిరత్నంకు జీవికి ఒక పేచీ వచ్చింది. దాంతో మణిరత్నం శ్రీనివాసన్ తో మద్రాస్ టాకీస్ మొదలుపెట్టాడు. ఆ తరవాత 2003లో వేరే కారణాల చేత GV ఆత్మహత్య చేసుకున్నాడు.
GV చనిపోయిన దగ్గర నుంచి మణిరత్నం ప్లాప్ ల పరంపరలో పడిపోయాడు. అయితే, మణిరత్నం టాలెంట్ పై ఎలాంటి అనుమానం లేదు. కానీ సినిమా తీయడంతో పాటు బిజినెస్ కూడా తెలిసి ఉండాలి. ఒక దర్శకుడు సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లి కలగాలి. రాజమౌళి ఎక్కడ ఏ మూల సినిమా ఆడుతుంది అనిపించినా అక్కడకు తన సినిమాని తీసుకువెళ్తాడు.
కానీ మణిరత్నంకు సినిమా తీయడం మాత్రమే వచ్చు, ప్రమోట్ చేయడం రాదు. అందుకే ఆయన సినిమాలు ఈ మధ్య ఎక్కువగా ప్లాప్ అవుతున్నాయి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Most of mani ratnams films are flops or boring
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com